వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

రికార్డుల మోత.. రివార్డుల బాట..

ఏడాదిలో రూ. 11 కోట్ల మేర గంజాయిని పట్టుకున్న కామ ఎక్సైజ్ పోలీసులు.

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్న క్యాష్ రివార్డులు ప్రశంసాపత్రాలు..

నేడు హైదరాబాద్ ఆప్కారి భవన్ లో ప్రధానం చేయనున్న డైరెక్టర్.

అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఖమ్మం కొత్తగూడెం ఎక్సైజ్ యంత్రాంగం పనితీరుకు అద్దం పట్టినట్లు గా ఉంది.

తెలంగాణలో మొత్తం ఎక్సైజ్ శాఖలు 2024 సంవత్సరంలో 6000 కేజీల గంజాయిని పట్టుకుంటే ఒక ఖమ్మం ఖమ్మం జిల్లాలో 2225 కేజీల గంజాయిని పట్టు పట్టుకుని తమ సత్తా చాటారు..

ఖమ్మం జిల్లాలో 2225 కేజీల గంజాయిని పట్టుకోవడంలో టాప్ గా నిలిచారు .

గంజాయితోపాటు 16,435 కేజీల బెల్లం 500 కేజీల ఆలయం కూడా పట్టుకుని తమ రికార్డులను వారి బ్రేక్ చేసుకున్నారు.

పనితీరు లో నైపుణ్యం కనపరచినటువంటి ఎక్సైజ్ యంత్రాంగానికి హైదరాబాదులోని ఎక్సైజ్ భవన్ లో సోమవారం ప్రతిభ కనబరిచిన వారికి కాష్ రివార్డులు ప్రశంసాపత్రాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందించనున్నారు.

2024 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 25 వరకు 35 కేసుల్లో ఈ రికార్డులను ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులు సాధించారు.

ఖమ్మం జిల్లాలో భద్రాచలం పాల్వంచ అశ్వరావుపేట కొత్తగూడెం ఎక్సైజ్ పోలీసుల మొత్తం 35 కేసుల్లో భారీగా గంజాయిని బెల్లాన్ని పట్టుకోవడం పట్ల పట్టుకోవడంతోపాటు 35 వాహనాల్లో 11 కార్లను స్వాధీనం చేసుకున్న ఘనత కూడా భద్రాచలం ఎక్సైజ్ పోలీసులకే దక్కింది.

ఈ ఎక్సైజ్ పోలీసుల సేవలను గుర్తించినటువంటి డైరెక్టర్ నేడు వారందరికీ ప్రశంసాపత్రాలను అందించనున్నారు. కానిస్టేబుల్ నుంచి అన్ని స్థాయిలో యంత్రాంగానికి ఈ క్యాష్ అవార్డులు ప్రశంస పత్రాలు అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు