ఖమ్మం మే24 విఎన్బి స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు 

సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ పివీ శ్రీనివాసరావు ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా జర్నలిస్టుల బృందం ఘనంగా సన్మానించారు.

ఖమ్మం వాసి పివీ శ్రీనివాసరావుకు ఆర్టిఏ సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన సందర్భంగా నగరంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ఆయనను సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ… సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిన పివీ శ్రీనివాసరావు మన ఖమ్మం వాసి కావడం సంతోషదాయకమని, విద్యార్థి దశ నుంచి అలుపెరగని పోరాటాలు నిర్వహించి అసంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అందరి మన్ననాలు పొందిన పివీ శ్రీనివాసరావుకు ఆర్టిఐ కమిషనర్ గా ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.
ఆయన పైన కష్టానికి తగిన ఫలితం లభించినట్లు అయిందని, ప్రజల శ్రేయస్సు కోసం మరింత వన్నె తేవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ జాతీయ నాయకులు వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు మందులో ఉపేందర్, వనం నాగయ్య, టీఎస్ చక్రవర్తి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు , నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యల్లమందల జగదీష్, కర్రిషా అశోక్, కెమెరామెన్ వెంపటి నాయుడు  అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, జిల్లా నాయకులు రామారావు, పోన్నేబోయిన పానకాలరావు, ఉల్లోజు రమేష్, మూల జీవన్ రెడ్డి, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, నల్లమోతు శ్రీనివాస్, మందుల వెంకటేశ్వర్లు, యాదగిరి, ప్రజా వాక్యం వెంకటేశ్వర్లు, నరేష్, మోహన్,పి. వి. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed