ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు


పాలియేటివ్ కేర్ సెంటర్ ను సందర్శించిన డి.ఎం.హెచ ఓ
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని పాలియేటివ్ కేర్ సెంటర్ (ఉపశమన సంరక్షణ కేంద్రం ) ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.డి.రామారావు, మెడికల్ సూపరింటెండెంట్ డా. నరేందర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలియేటివ్ కేర్ లో ఇన్ పెషేంట్లుగా వున్న వారితో మాట్లాడి అందుతున్న సేవలు, సిబ్బంది ప్రవర్తనల గురించి తెలుసుకున్నారు. వైద్య సేవలు, శారీరక ఉపశమనతో పాటు మానసిక ప్రశాంతతను అందించడం కోసమే ఈ కేంద్రాల అవసరత వుందని తెలిపారు. డా. రిషిత, నర్సింగ్ ఆఫీసర్ సుజాత, ల్యాబ్ టెక్నీషియన్ రత్నం, ఫార్మసి ఆఫీసర్ మన్మధరావు, కౌన్సిలర్ మక్బూల్ పాష ల విధుల్ని, అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎన్.సి.డి. క్లినిక్, కీమోతెరపి వార్డులను పరిశీలించి అక్కడ వున్న పేషంట్లతో మాట్లాడారు. డా.అనూష తో పేషంట్లకు ఓ.పి.లో అందుతున్న సేవలు, సదుపాయల గురించి చర్చించారు. తెలంగాణ డయాజ్ఞాస్టిక్ హబ్ ను సందర్శించి శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్, ల్యాబ్ రిజల్ట్స్, రికార్డ్స్, రిజిస్టర్స్, రిపోర్ట్స్ పరిశీలించారు. రిజల్ట్స్ ఆలస్యం కాకుండా సమయానికి అందించాలని, సిబ్బంది క్రమశిక్షణతో పాటు సమయపాలన తప్పక పాటించాలని, ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అందరూ తప్పక వేయాలని, పరిసరాలను, పేషంట్ల వెయిటింగ్ హాల్ ను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.డి.రామారావు తెలిపారు. వారి వెంట ఎన్.సి.డి. జిల్లా కో ఆర్డినేటర్లు సత్యనారాయణ, పులి మురళి వున్నారు. మొత్తంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచి oచారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed