Category: KHAMMAM

దశలవారీగా కార్యాచరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ జర్నలిస్టులకి హామీ

ఆందోళన అవసరం లేదు *దశల వారి ప్రక్రియకు కార్యాచరణ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఖమ్మం ఫిబ్రవరి 20: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖమ్మం జిల్లా…

నిర్లక్ష్యాల నీడలో ఖమ్మం పత్తి మార్కెట్

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకటైన పత్తి మార్కెట్ యార్డు నిర్లక్ష్యం నీడలో కొనసాగుతుందివ్యవసాయ మార్కెట్ కు గత మూడు రోజులుగా సెలవులు రావడం తో కోట్లు విలువ చేసే పత్తిని మార్కెట్లో ట్రేడర్స్ నిల్వ ఉంచారు. లారీలు లేకపోవడం వలన తాము…

జర్నలిస్టులకు మద్దతుగా నిలుస్తామని సిపిఎం పార్టీ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు వెల్లడి

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు .. ఐదు ఎకరాలు ఎలా సరిపోతాయి?


జర్నలిస్టులకు వెలుగులు నింపిన సీఎం కేసీఆర్
మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ
సీఎం కెసిఆర్.. మంత్రి పువ్వాడ చిత్రపటాలకు జర్నలిస్టుల పాలాభిషేకం
ఖమ్మంలో జర్నలిస్టుల హర్షాతిరేకాలు
ఖమ్మం ఫిబ్రవరి 7: అనేక దశాబ్దాల ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలలను సహకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లు ఖమ్మం జర్నలిస్టులకు వెలుగులు నింపే విధంగా ఇండ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఖమ్మం నగరంలోని జర్నలిస్టులకు మొదటి దశ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈనెల10 న లేదా 14న మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న నేపథ్యంలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ TUWJ TJF ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మంత్రి తన్నీరు హరీష్ రావు చిత్రపటాలకు ఘనంగా పాలభిషేకం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని తూచా తప్పకుండా మాట నిలబెట్టుకున్న నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. జర్నలిస్టులు అనేక ఏళ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, వాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేత స్పష్టమైన హామీని ఇప్పించడంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సాగద్యంలో ఎవ్వరికి అనేక దఫాలుగా మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి వినత పత్రాల రూపంలో అభ్యర్థించడం జరిగిందని, వివిధ రూపాలలో తలపెట్టిన ఉద్యమాల ఫలితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కడం అభినందనీయమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. జర్నలిస్టుల కళ్ళల్లో వెలుగులు నింపిన సర్కార్ కు రుణపడి ఉంటామఅన్నారు.
పాలాభిషేకం కార్యక్రమం ఉత్సాహపరితంగా ఆనందోత్సవాల నడుమ కొనసాగింది.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి వెంపటి నాగేశ్వరరావు నాయుడు జీవన్ రెడ్డి, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యల్లమందల జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ పాషా, జిల్లా, నగర నాయకులు పానకాలరావు, వల్లూరి సంతోష్, జక్కుల వెంకటరమణ, ఆర్ కె, తిరుపతి రావు, రోసి రెడ్డి, వెంకటరెడ్డి, రంజాన్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరలో ప్రారంభించారు మంత్రి తెలిపారు

KHAMMAM;ఐదేళ్లు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం కాదు ఐదు తరాల అభివృద్ధి యే అజయ్ అన్న ధ్యేయం. 👇నగర ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి రానున్న వెజ్ & నాన్ వెజ్ మార్కెట్.. ▪️ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్న అధికారులు.. ▪️మంత్రి పువ్వాడ…

నగర ఏసిపిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ pvగణేష్ మర్యాదపూర్వకంగా సిపి ని కలిసిన ఏసిపి

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు … ది.03.02.2023పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …. ఖమ్మం టౌన్ ఏసీపీ గా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్ ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ. గణేష్ ఖమ్మం ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం…

మన బస్తి మనబడి కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మొదటి విడత మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా మామిళ్ళగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. పాల్గొన్న మేయర్ నీరజ గారు,కలెక్టర్ గౌతమ్ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్…

You missed