Month: February 2023

సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ .
పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
ఖమ్మం నగరంలో ఆదివారం బైపాస్ రోడ్ కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 20వ మహాసభకు ముఖ్యఅతిథిగా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడరు . శభాష్ గ్రామీణ వైద్యులు , సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ లో ఉన్నారని , సమాజంలో గ్రామీణ వైద్యుల సేవలు మరువలేనివని అన్నారు . రోగాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి మెరుగైన వైద్యాన్ని సమయానికి అందెల చూస్తున్నారు . గ్రామీణ వైద్యులు అంటే ప్రాణ దాతలని వారి వల్ల కొన్ని వేల కుటుంబాలు అనాధలు కాకుండా నిలబడుతున్నాయని కొనియాడారు . సంఘం కార్యాలయానికి తమ వంతుగా నగదు రూపంలో గానీ స్థలం రూపంలో గానీ కొంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు . అలాగే తమ సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చోర్వాత ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు . వైద్యం అంతే వ్యాపారం కాదని సేవా భావంతో కలిగి ఉండాలని సూచించారు . ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని , వారు ఎవరికి వ్యతిరేకం కాదని , ఆగిపోయిన శిక్షణా తరగతులను మళ్లీ పునర్దించి జీవో ప్రకారం అర్హులైన వారికి సర్టిఫికెట్ లను అందజేసి నకిలీ అని అవమానించే వారి నుండి రక్షించాలని కోరారు . అనంతరం వచ్చిన అతిథులను మరియు వివిధ మండలాల అధ్యక్షులను , కార్యదర్శులను ఘనంగా శాలవలతో సత్కరించారు . ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు , ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరావు వహించి మాట్లాడారు . వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామీణ వైద్యులందరికీ శిక్షణ ఇప్పించి గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చారని , ఆయన చనిపోవడంతో ఆగిపోయిందని , ఆ తర్వాతకి తెలంగాణ ఉద్యమం మొదలైందని ఈ తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ వైద్యుల్లంత చాలా చురుకుగా క్రియాశీలకంగా పనిచేశారని , రాష్ట్ర రోకలో , సకల జన సమ్మెలో పాల్గొన్నారని అన్నారు . ఆనాడు కేసీఆర్ ఏదైతే ఆగిపోయిందో గ్రామీణ వైద్యులకు మళ్లీ శిక్షణను ఇప్పించి సర్టిఫికెట్లు జారీ చేపిస్తానని అలాగే వైద్య వృత్తిలో కొన్నిటిని క్రియాశీలకం చేస్తానని ఆనాడు మాటిచ్చారని అది ఇంతవరకు చేయడం లేదని , క్రియా రూపంలో దాచలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత , జెడ్పిటిసి వరప్రసాద్ , రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా – వేణు , గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ , రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ , ఖమ్మం జిల్లా కమిటీ , జిల్లా కార్యదర్శి అనంతరపు వెంకటాచారి మరియు సంకల్ప హాస్పిటల్ డాక్టర్ రాకేష్ , dr.చైతన్య , క్యాన్సర్ నిపుణులు dr. వంశీ , పిల్లల డాక్టర్స్ dr. గౌతం , dr. రాజ్ కుమార్ , ఎందుక్రైనాలోజిస్ట్ dr. కావ్య , dr. రాజశేఖర్ , dr.ప్రదీప్ , జిల్లా ఉపాధ్యక్షులు N మణికుమార్ , M.సుదర్శన్ , P.వెంకటరామయ్య లు పాల్గొన్నారు . ఉమ్మడి జిల్లాల నలుమూలల నుండి విచ్చేసిన గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు .

★రఘునాథపాలెం మండలంలో పొలాలకు రాజభాటలు వేసిన మంత్రి పువ్వాడ
◆2కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్న డొంక రోడ్ల నిర్మాణ పనులు
◆హర్షిస్తున్న రైతన్నలు
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్ల రూపురేఖలు మారాయి. మండల వ్యాప్తంగా ప్రధాన రోడ్లు అన్ని ఇప్పటికే సుందరంగా తయారయ్యాయి. 10 సంవత్సరాల క్రితం ఖమ్మం నియోజకవర్గంను చూసి ఇప్పుడు చూసినవాళ్లు అబ్బురపడుతున్నారు. గతంలో కొంత అభివృద్ధి జరిగినా ఇప్పుడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రెండు కోట్ల ప్రత్యేక నిధులతో డొంక రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా మండల ప్రజానీకం, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఆదివారం వేళ రజబ్ అలీ పార్కు జనంతో కళ కళ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక దృష్టితో నాడు దుర్గంధం వెదజల్లే మురికికూపలు, నేడు ఆహ్లాదం పంచే ఉద్యానవనలు కావడంతో 46వ డివిజన్లోని రజబ్ అలీ పార్క్ ఆదివారం జనాలతో కిటకిటలాడింది.నాడు మురికికూపంగా ఉన్న ప్రాంతం నేడు ఆహ్లాదంతో పార్కులు సందడిగా ఉండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైన్ షాప్ ల దగ్గర జాతర్ల పర్మనెంట్ రూమ్స్ నిబంధనలు ఉల్లంఘన

*జాతర లా పెర్మనెంట్ యదేచ్ఛగా విక్రయాలు *ఉల్లంఘిలా మత్తు.. జాతర్ల పర్మినెంట్.. మద్యం షాపుల వద్ద నిబంధనలకు తూట్లు… మద్యం షాపులలో సరుకు కొని తాగేసి వెళ్లిపోయేందుకు ఉన్న పర్మనెంట్ రూములతో పరేషాన్ పడేసింది. పరిమితికి మించి విస్తరణలో రూములు లోపల…

సకల సౌకర్యాలతో కార్పొరేట్ తీటుగా ప్రభుత్వ విద్య

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ప్రతినిధి వెంపటి నాయుడు సకల సౌకర్యాలతో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ విద్యా.. ▪️విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఆధునీకరణ.. నాణ్యమైన విద్య. ▪️ రూ.16.92 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన…

ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు ఎస్ఆర్ కన్వర్షన్ లో ఏర్పాటు చేయడమైనది

ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు పొలిటికల్ పవర్ న్యూస్ 9 .ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు.. ఫిబ్రవరి 27, 28న మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలు— పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు…

రైతులకు కమిషన్ దారులకి డిష్యూ డిష్ ఖమ్మం మిర్చి మార్కెట్

జిల్లా కేంద్రంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం కమిషన్ దారులు, రైతులు మధ్య వివాదం నెలకొంది. ఈ వారంలో మార్కెట్ కు అధికంగా మిర్చి బస్తాలు వచ్చాయి. శుక్రవారం ఒక క్వింట మిర్చి ధర రూ. 20,800 ఉండగా శనివారం…


అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.
ఖమ్మం జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.
రాజ్యాంగ నిర్మాణకర్త DR.BR అంబేడ్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప స్థాయిలో అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ గారి పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.
Zp చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు, కలెక్టర్ గౌతమ్ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, ఎమ్మెల్సీ తాత మధు గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు
★మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి
స్వతంత్ర సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా VDO’s కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో ఘన నివాళ్ళుర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు, మంత్రి గారి PA రవికిరణ్ గారు,జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ గారు,కార్పొరేటర్లు మక్బూల్ గారు జ్యోతి రెడ్డి గారు,సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ శంషుద్దీన్ ఎండి.మోషన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కుట్టు మెషీన్ లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.
▪️శిక్షణ పొందిన 41 మందికి ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ.
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం సుగ్గలవారి తోట నందు మహిళలకు జన శిక్షన్ సంస్తాన్ వారి అధ్వర్యంలో తరుపున ఉచితంగా శిక్షణ ఇచ్చి 41 మంది మహిళలకు NRI ఫౌండేషన్ మరియు శ్రీ మిత్ర ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన కుట్టు మెషీన్ లను మంత్రి పువ్వాడ చేతుల మీదగా పంపిణీ చేశారు.
స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన కుట్టు మిషన్‌, ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలంటే ముందు వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు టైలరింగ్ మంచి ఉపాధి అని అన్నారు.

You missed