★రఘునాథపాలెం మండలంలో పొలాలకు రాజభాటలు వేసిన మంత్రి పువ్వాడ
◆2కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్న డొంక రోడ్ల నిర్మాణ పనులు
◆హర్షిస్తున్న రైతన్నలు
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్ల రూపురేఖలు మారాయి. మండల వ్యాప్తంగా ప్రధాన రోడ్లు అన్ని ఇప్పటికే సుందరంగా తయారయ్యాయి. 10 సంవత్సరాల క్రితం ఖమ్మం నియోజకవర్గంను చూసి ఇప్పుడు చూసినవాళ్లు అబ్బురపడుతున్నారు. గతంలో కొంత అభివృద్ధి జరిగినా ఇప్పుడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రెండు కోట్ల ప్రత్యేక నిధులతో డొంక రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా మండల ప్రజానీకం, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ByVNB News

Feb 26, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు