సందేశ్ కరాటి అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 ను ప్రారంభించిన పల్లా కిరణ్.
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం : గాంధీచౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో బ్లాక్ బెల్ట్ 5 డాన్ కరాటే మాస్టర్ కందాల సందేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థకంగా నిర్వహించిన నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతి వెలిగించి రూబెన్ కట్ చేసి ప్రారంభించారు . మరో విశిష్ట అతిధులు త్రీటౌన్స్ సిఐ సర్వయ్య , వింఫిల్డ్ హై స్కూల్ డైరెక్టర్లు శ్రీకాంత్ , కిషోర్ మరియు కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ హనీ హాసన్ యం. ఇస్మాయిల్ , సౌత్ ఇండియా కరాటే చీఫ్ మహమ్మద్ ఫావద్ సయ్యద్ లు పాల్గొని పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ కీ॥శే॥ కామ్రేడ్ శ్రీ పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు . కరాటే నేర్చుకోవడం వలన మానసిక ఎదుగుదల , శరీర దృడత్వం పెరిగి బలిష్టంగా కనిపిస్తారని అన్నారు . ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అనగా తమను తమ ఆపదలలో రక్షించుకోవడానికి దోహదపడుతుందన్నరు . చిన్ననాటి నుండి పిల్లలు కరాటే అవలంబించడం వలన పిల్లల మనసు ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండి మైండ్ షార్ప్ గా తయారవుతుందన్నారు. హైదరాబాద్ , కోరట్ల , నల్లగొండ , బొంబాయి , మహబూబాబాద్ , కోదాడ , కొత్తగూడెం భద్రాచలం , ఖమ్మం , విజయవాడ , సూర్యాపేట పలు ప్రాంతాలనుండి సుమారుగా 800 మంది పిల్లలు మరియు వివిధ జిల్లాలు , ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్స్లు , అసోసియేషన్ వారు పాల్గొన్నారు .

ByVNB News

Mar 13, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed