బంగారం కొనండి సంపదను పెంచుకోండి
◆ ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ
◆ ‘లక్ష్మి శ్రీనివాస జ్యూయలరీస్’ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
◆ ఖమ్మంలో బంగారంతో మెరిసిన రష్మీ
◆ భారీగా తరలివచ్చిన జన సందోహం

ఖమ్మం, మార్చి 13 : ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ‘లక్ష్మీ శ్రీనివాస’ జ్యూయలరీస్ షోరూమ్ ను ప్రముఖ నటి, టీవీ యాంకర్ రష్మీతో కలిసి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ నగల వ్యాపారి దుగ్గి శ్రీనివాసరావు నూతనంగా నిర్మించిన వెండి బంగారు ఆభరణాల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా టీవీ యాంకర్, కుమారి రష్మీ మాట్లాడుతూ.. సమాజంలో గౌరవంగా ఉండాలంటే బంగారం ఎంతో ముఖ్యమని, అటువంటి బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి తమ సంపదను పెంచుకోవాలని అన్నారు. గత 25 సంవత్సరాలుగా వెండి బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్న ప్రముఖ వ్యాపారి దుగ్గి శ్రీనివాసరావు సారధ్యంలో నూతనంగా జ్యూయలరీస్ షోరూంను నిర్మించడం అభినందనీయమని అన్నారు. నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా ఉన్న ‘లక్ష్మీ శ్రీనివాస జ్యూయలరీస్’ మరో అడుగు ముందుకు వేసి ప్రజలు ముందుకు రావడం విశేషమన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నగల వ్యాపారి దుగ్గి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కస్టమర్ల ఆశయాలకు, అభిరుచులకు అనుగుణంగా వేలాది డిజైన్లతో రూపొందించిన సరికొత్త వెండి, నగల ఆభరణాలు తమ షోరూంలో ఉన్నాయని అన్నారు. మీ సంపదను నగలపై పెట్టడం ద్వారా మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. తాము ఇచ్చే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నటి రష్మీ, నగల వ్యాపారి యాజమాన్య కుటుంబ సభ్యులతో కలిసి ‘గున్నా గున్నా మామిడి’ అనే పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ఈ కార్యక్రమంలో జ్యూయలరీస్ షోరూం నిర్వాహకులు దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి లక్ష్మి, దుగ్గి అభినవ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, వెండి బంగారు ఆభరణాల వ్యాపారుల సంఘం అధ్యక్షులు బందు సూర్యం, భద్రాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, పలువురు ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు