శ్రీ రామకృష్ణ విద్యాలయం లో “బలగం కోమరయ్య” కు ఘన సత్కారం

ఖమ్మం : ప్రతి ఒక్కరి నోట పలుకుతూ ప్రశంసలు అందుకుంటున్న సినిమా బలగం . చిన్న సినిమా అయినా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న విశయం మనందరికీ తెలిసిన విషయమే. బలగం చలనచిత్రం మొత్తం కోమరయ్య అనే పాత్ర చుట్టూ తిరగటం ఆ పాత్ర లో నటించిన శ్రీ కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి కి మంచి గుర్తింపుని తెచ్చి పెట్టినది . కోమరయ్య పాత్ర లో వదిగిపోయి నటించి అందరిని మెప్పించిన సుధాకర్ రెడ్డిని స్థానిక గుత్తాలబజార్ లోని శ్రీ రామకృష్ణ విద్యాలయం కు ఆహ్వానించి ఘనంగా సకతరించారు . కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎన్నో సంవత్సరాలు శ్రీ సరస్వతి శిశుమందిరంలో ఆచార్యునిగా , ప్రధానాచార్యునిగా పని చేస్తూ , రంఘస్టల ప్రముఖ గా వ్యవహరించారు . అపపిటినుంచి ఎందరినో కళారంగానికి పరిచయం చేశారు . వారిని ఇలా మా పాఠశాలకు ఆహ్వానించి సత్కరించుకోవటం చాలా ఆనందం గా ఉన్నది అని పాఠశాల అద్యక్షులు డాక్టర్. జి. వి . తెలిపారు . అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇలా తాను పనిచేసిన శిశుమందిరాల కు తిరిగి ముఖ్య అతిది గా రావటం , అందరితో ఆనందం పంచుకోవటం చాలా బాగుంది అన్నారు . సమాజం లో నేర ప్రవృత్తి తగ్గాలి అన్నా , పిల్లలలో సంస్కారాలు అభివృద్ధి కావాలన్నా , పిల్లలలో పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరగాలన్నా శిశుమందిరాలు చాలా ముఖ్యం అని అన్నారు . అటువంటి శిశుమందిరాలలో ఒక్కటైన శ్రీ రామకృష్ణ విద్యాలయం కు రావటం చాలా సంతోషం గా ఉన్నది అన్నారు . పాఠశాల ప్రధానాచార్యులు సంతోషా గౌతం మాట్లాడుతూ తమ శ్రీ సరస్వతీ విద్యాపీఠం లో ఆచార్యునిగా ఎందరికో మార్గ నిర్దేశం చేసి , మరేందరికో రంఘస్టల ప్రముఖ గా కళామ్మ తల్లిని పరిచయం చేసి ఈ రోజు ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుకున్న కేతిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఇలా సత్కరించుకోవటం ఎందరికో స్పూర్తి దాయకంగా ఉంటుంది అని అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల అద్యక్షులు డాక్టర్. జి. వి ., సెక్రెటరీ ఎన్. శ్రీనివాస రావు , సైక్షనిక్ ప్రముఖ్ కృష్ణ మూర్తి , విభాగ కార్యదర్శి సుబ్బారావు , అడ్వకేట్ తిరుమలరావు , rss సంపర్క్ కార్యదర్శి కర్లపాటి సురేష్ కమిటీ సబ్యులు , పాఠశాల బోదన బోదనేతర సిబ్బంది , పిల్లలు , పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు