






సీనియర్ పువ్వాడ ను పరామర్శించిన మంత్రి కేటిఅర్..
గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న CPI జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి తండ్రి పువ్వాడ నాగేశ్వర రావు గారిని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ గారు మంగళవారం పరామర్శించారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కెటిఆర్ గారిని చూసి సీనియర్ పువ్వాడ గారు భావోద్వేగానికి లోనయ్యారు.
అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు గారి అరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటిఆర్ గారికి వైద్యులు క్షుణ్ణంగా వివరించారు.
మంత్రి కేటిఆర్ గారి వెంట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు.
