దావత్-ఏ-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ.
▪️గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం.
▪️వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ గెలిపించుకోవాలి.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖమ్మం నియోజకవర్గ కేంద్రం సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ విందు లో హోం మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.
గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి మహమూద్ అలీ అన్నారు.
విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు







