సాదుకుంటారా.. సంపుకుంటారా.. మంత్రి పువ్వాడ.

పొలిటికల్ పవర్ ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

రాష్ట్ర ప్రగతి కోసం అనునిత్యం అలుపెరగుండా కృషి చేస్తూ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న BRS రాష్ట్ర ప్రభుత్వాన్ని సాదుకుంటారా లేదంటే సంపుకుంటారా ఆలోచించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

BRS రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఖమ్మం జిల్లా సతుపల్లి నియోజకవర్గం రామానుజవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

మన రాష్ట్రంలో 4 కోట్ల పై బడిన ప్రజానీకం ఉందని, అందుకు సరిపోను తిండి గింజలు మన రాష్ట్రంలోనే పండిస్తున్నామన్నారు.

మన రాష్ట్రంతో పాటు ఇతర అనేక రాష్ట్రాలకు తిండి గింజలు అందిస్తున్న గొప్ప రాష్ట్రం మనది.. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంది అని అన్నారు..

ఖమ్మం జిల్లాలోని చివరి ఎకరా వరకు సాగర్ జలాలు అదెలా ఎమ్మెల్యే సండ్ర విశేష కృషి చేస్తున్నారని, ఇంత చోరవ వేరే నాయకులకు ఉంటదా.. అంత చొరవ చుపగలరా అని అన్నారు.

కాకరకాయ కూడా పంచని నేతలు, ఎన్నికలు సమీపిస్తుండటంతో తగుదునమ్మా అంటూ అనేక మంది వస్తారని వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా సమయంలో గ్రామ గ్రామంలో, క్వారంటైన్ కేంద్రాలు, ఇళ్ళల్లో తిరిగి వారికి కావాల్సిన సదుపాయాలు అందించిన విషయం గుర్తు చేశారు.

కష్టకాలంలో ప్రజలను ఆదుకోని నాయకులను ఇప్పుడు వచ్చి ప్రజలకు ఏం చేస్తారో ప్రజలే గుర్తించాల్సిన అవసరం ఉంది.

ఇచ్చిన తెలంగాణ ను వెనక్కు తీసుకున్న సమయంలో మళ్ళీ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టి సావునోట్లో తలకాయ పెట్టి చివరి అంచుల దాకా పోయిన కేసీఆర్ గారి పోరాట పటిమ వల్లే మళ్ళీ తెలంగాణ ను సాధించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విజయవంతంగా నడిపిస్తుంటే కొన్ని దుష్ట శక్తులు ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు