చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

▪️బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన మంత్రి పువ్వాడ.

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ఏప్రిల్ 25 జిల్లా ప్రతినిధి వెంపటి నాయుడు

▪️నలుగురు మృతులకు రూ.40 లక్షలు, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డవారిని రూ.10 లక్షలు పంపిణీ.

▪️జిల్లా కలెక్టరేట్ నందు ఆయా చెక్కులను అందజేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియ ను బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల విలువైన చెక్కులను స్వయంగా అందజేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ తాతా మధు గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు..

మంగళవారం జిల్లా కలెక్టరేట్ నందు బాధిత కుటుంబాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పరామర్శించి ఓదార్చారు. ఈ ఘటన చోటుచేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఘటనలో నలుగురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు.

ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని, ప్రమాదం 12వ తేదీన జరిగిందని కేవలం 2వారాల్లోనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పించి ప్రభుత్వం స్పందించి నష్టపరిహారంను అందజేస్తామని వివరించారు.

ప్రమాదం జరిగిన నాటి నుండి ప్రభుత్వం నిత్యం వారిపై దృష్టి సారించిందని, వారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేడు ప్రకటించిన పరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రమాదంలో గాయపడిన రోజు వారికి చికిత్స కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటిఆర్ గారు, నిత్యం పర్యవేక్షిస్తూ వారి కుటుంబానికి తోడుగా ఉన్నారని అన్నారు.

ఈ దుర్ఘటనలో బాధితులకు నష్ట పరిహారంతో పాటు మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వనున్నట్లు హామీ ఇస్తున్నామని, ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు అందుకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

అంగవైకల్యం అయిన వారికి ఆర్టిఫీషియల్ లింబ్స్ ఇచ్చి, వారి కుటుంబ జీవనోపాధి కోసం తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారు . దీనితో పాటు వారి పిల్లలకు వారు కోరుకున్న చోట రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఉచిత విద్యను అందిస్తామని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బానోత్ జ్యోతి w/o రమేష్, దర్మసోత్ సరోజ, w/o లక్ష్మణ, అజ్మీరా లలిత w/o మంగు, సందీప్ ల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో నారాటి వెంకన్న, తెజవత్ భాస్కర్, అంగొత్ కుమార్, దేవా నవీన్, కనగాల శ్రీనివాస్ ల కుటుంబాలకు రూ.2.50లక్షల మొత్తం రూ.52.50 లక్షల విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు