విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, మహమూద్ అలీ.

రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్.. రూ.50 లక్షలతో తహశీల్దార్ కార్యాలయం..

నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం భావనలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మైమూద్ అలీ గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రులు లాంఛనంగా ప్రారంభించి సబ్ ఇన్స్పెక్టర్ మాచినేని రవి, తహశీల్దార్ నర్సింహ రావు లను తమ సీట్ లో కూర్చోబెట్టారు.

రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో తహశీల్దార్ భావనలు నిర్మించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రారంభించుకోవడం పట్ల మంత్రి మైమూద్ అలీ గారు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన మండలాలు, నూతన గ్రామాలు ఎర్పాటు చేసుకుని తమ గ్రామాలను తామే పలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు