VNB TV NEWS kmm vempatti Naidu

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

▪️నేడు 34 చెక్కులకు గానూ రూ.34.03లక్షల చెక్కులు పంపిణీ.

▪️నేటి వరకు నియోజకవర్గంలో 8460 చెక్కులకు గాను 79.67 కోట్ల పంపిణి.

రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు.

సోమవారం ఖమ్మం నగరంలో కల్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మనురైన 34 మంది లబ్ధిదారులకు గాను రూ.34.03 లక్షల చెక్కులను, చీరలను మంత్రి పువ్వాడ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ గారి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు.

పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.

ఈ పథకం ద్వారా నేటి వరకు నియోజకవర్గంలో 8460 చెక్కులకు గాను 79.67 కోట్ల రూపాయలు పంపిణి చేయడం గర్వంగా ఉందన్నారు.

అనంతరం లబ్ధిదారుల కోసం ఎర్పాటు చేసిన భోజనంలో వారికి స్వయంగా వడ్డించారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, AMC చైర్మన్ దోరెపల్లి శ్వేత, కార్పొరేటర్ లు రావూరి కరుణ, దండా జ్యోతి రెడ్డి, పసుమర్తి రాంమోహన్, మెడారపు వెంకటేశ్వర్లు, ఆళ్ళ నిరీష రెడ్డి, చామకురి వెంకన్న, నాయకులు షౌకత్ అలీ, శీలంశెట్టి వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, కన్నం ప్రసన్న కృష్ణ, షకీన తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు