తేజ వార్త డిజిటల్ మీడియా డైలీ పేపర్

ఖమ్మం, ఆగస్టు 3: పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి, పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో మమేకమై పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 460 మంది పిల్లలున్నట్లు, ఉన్న టాయిలెట్ బ్లాకును బాలికల కొరకు వినియోగిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శైలజ తెలిపారు. స్పందించిన కలెక్టర్ టాయిలెట్ బ్లాకు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు, యూనిఫాం అందినది లేనిది, ఆంగ్ల బోధన విషయమై అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, లక్ష్యం దిశగా పట్టుదలతో శ్రమించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఉద్భోదించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, సిఎంఓ రాజశేఖర్, ఎస్ఎంసి చైర్మన్ నారాయణ రావు, అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు