అడుగడుగునా మదన్ లాల్ కు ఘన స్వాగతం

అంబేద్కర్ విగ్రహం కి పూల మాల వేసిన మదన్ లాల్
వైరా లో భుతల్లి ని ముద్దాడిన మదన్ లాల్
ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా చూసుకుంటా
24 గంటలు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయవచ్చు
ఎమ్మెల్యే రాములు నాయక్ మా బావ
బీఆర్ఎస్ పార్టీని మేము కలిసి ముందుకు తీసుకెళ్తాం
మూడోసారిగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి
చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మన్నించండి
వైరా లో బాణోత్ మదన్ లాల్
బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత శుక్రవారం తొలిసారి వైరా కి వచ్చిన భానోత్ మదన్ లాల్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. తనికెళ్ల సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నుండి వైరా వరకు ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున బీఆర్ యస్ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు మదన్ లాల్ కు స్వాగతం పలికారు. తనికెళ్ల నుంచి వైరా వరకు రహదారి జనసంద్రంగా మారిపోయింది. ఈ సందర్భంగా మదన్ లాల్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా మదన్ లాల్ కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పుల వరం కురిపించి హారతులు పట్టారు . వైరా చేరుకున్న మదన్ లాల్ స్థానిక పాత సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు .అక్కడ ను రింగ్ రోడ్ కు చేరుకున్న మదన్ లాల్ వాహనాన్ని దిగి కిందకి వెళ్లి నేలను ముద్దాడి వైరాగడ్డ రుణం తీర్చుకుంటానని అన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగకుండా ముందుకు పోవాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి అన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఆశీర్వదించి వైరా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే రాముల నాయక్ మా బావ అని మేమిద్దరం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తు ముందుకు పోతూ ఈ నియోజకవర్గంలో పార్టీని ఎదురులేని శక్తిగా తీసుకొచ్చి ముందుకు పోతామన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తూ కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిఇచ్చారని. అదేవిధంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాననుసారం పార్టీ అభివృద్ధి ధ్యేయంగా తాను ముందుకు పోయాను అన్నారు. ప్రతి కార్యకర్తను కనుపాపల కాపాడుకుంటానని అండగా ఉంటానని తెలిపారు. మనస్పర్ధలు ఏమన్నా జరిగి ఉంటే పెద్ద మనసుతో మన్నించి అందరం కలిసి ముందుకు పోవాలన్నారు. రానున్న రోజుల్లో వైరా నియోజకవర్గంలో మంత్రి ఎంపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే గడపగడపకు తిరుగుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు పోతానని మదన్ లాల్ అన్నారు అన్నారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
