భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. పెనుబల్లి మండలం, బ్రాహ్మలకుంట పరిధిలోని పులిగుండాల ప్రాజెక్టు కట్ట పై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొని మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం అద్భుతమైనది అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కొనియాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడింది. సకాలంలో వర్షాలు పడుతుండటంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ గారి వల్లే సాధ్యం అయింది. హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ పెరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి పాటుపడాలి అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో FDO మంజుల, FRO అరవింద్, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు, బి.ఆర్.యస్ మండల అధ్యక్షులు కనకాల వెంకటరావు, సర్పంచులు ద్వాలి, కిరణ్ రెడ్డి, అశోక్, ఎంపీటీసీ కానగల సురేష్ బాబు, నాయకులూ జోనల్ అధ్యక్షులు గువ్వల వెంకట రెడ్డి క్షత్రియ, కాకా సీతారాములు, ప్రసాద్ తదితరులున్నారు.
