భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. పెనుబల్లి మండలం, బ్రాహ్మలకుంట పరిధిలోని పులిగుండాల ప్రాజెక్టు కట్ట పై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొని మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చ‌న కార్యక్రమం అద్భుతమైనది అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కొనియాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడింది. సకాలంలో వర్షాలు పడుతుండ‌టంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ గారి వల్లే సాధ్యం అయింది. హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ పెరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి పాటుపడాలి అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో FDO మంజుల, FRO అరవింద్, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు, బి.ఆర్.యస్ మండల అధ్యక్షులు కనకాల వెంకటరావు, సర్పంచులు ద్వాలి, కిరణ్ రెడ్డి, అశోక్, ఎంపీటీసీ కానగల సురేష్ బాబు, నాయకులూ జోనల్ అధ్యక్షులు గువ్వల వెంకట రెడ్డి క్షత్రియ, కాకా సీతారాములు, ప్రసాద్ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు