






తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ
ఖమ్మం ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు
ఆర్టీసీని ప్రభుత్వం లో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.
నా ఆర్టీసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి. మీ చిరకాల వాంఛ నెరవేర్చినది కేసీఆర్
ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు.
ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టినప్పటి కి ఇవాళ ఆమోదం తెలిపింది.
ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం.
నాటి పాలకులు ఆర్టీసి అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారు.
మా ప్రభుత్వం ఆర్టీసీకి కార్మికులకు పట్టం కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను చేసింది.
ఇకనుండి కార్మికులు కాదు వారు ప్రభుత్వ ఉద్యోగులు
సీఎం గారు పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతి పక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి.
ప్రజలు పండగ లా భావిస్తే, వారు దండగ అంటున్నారు.
పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు. కాళేశ్వరం కంటే పెద్దది.
ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతి పక్షాలు దండగ.
నాడు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
మీరు పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారు.
కేసీఆర్ ను ఇంటి మనిషి అని ప్రజలు భావిస్తున్నారు.
మనకు పనోల్లు కావాలా, పగోల్లు కావాలా ప్రజలు ఆలోచించాలి.
బి ఆర్ ఎస్ కావాలి, కాంగ్రెస్ వద్దు అని అంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి పోటీ
గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ నీ ప్రజలు కోరుకోరు. బి ఆర్ ఎస్ మరోసారి గెలుస్తుంది.
కౌరవుల లాగా వంద అబద్ధాలు ఆడినా మీ పక్క జన బలం లేదు.
లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.
ఆటో డ్రైవర్ కొడుకు, హమాలీ కూలికి ఎంబిబిఎస్ చదవటం సంతోషంగా ఉంది.
ఎల్ కె కి చదువు ఎంతో ఖర్చుతో కూడుకున్న రోజులు. కానీ ఎంబిబిఎస్ ఫీ కేవలం 10 వేలు
ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ
ఐటీ ఉత్పత్తిలో, ఫార్మా రంగంలో, విద్య, వైద్యం, పంట, పాడి ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రస్థానం.
పాడి పంట, బడి మడి ఏదైనా చూడండి..
50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు.
ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు.
ఆకలి అయితే నాడు అన్నం పెట్టలేదు. కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటున్నారు.
ఛత్తీస్ గడ్, కర్ణాటక, రాజస్థాన్ లో చేయరు.. కానీ ఇక్కడ ఎలా చేస్తారు.
ఎరువుల కోసం ప్రజలు తన్నులు తినేవారు. తన్నుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అయితే బి ఆర్ ఎస్ హయాంలో టన్నుల (పంట ఉత్పత్తి) సంస్కృతి.
సీట్ల కోసం, పదవుల కోసం ఏమి జరగక ముందే ఖమ్మం
కాంగ్రెస్ కొట్లదితున్నది.
మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్
కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ ఉండే, ఇప్పుడు బెంగళూరు అయ్యింది. మా కు హైకమాండ్ ప్రజలే.
ఖమ్మం కరుణ కేసీఆర్, బి ఆర్ ఎస్ పై ఉండాలి. సీతారామ పథకం పనులు చివరి దశలో ఉంది. ఇక్కడి ప్రాంతం సస్య శమలం కావాలంటే కేసీఆర్ దీవించండి.
సీతారామ పూర్తి అయితే కరువు అనే పదం డిక్షనరీలో ఉండదు.
వచ్చే వానాకాలం నాటికి కృష్ణా లో నీళ్ళు ఉన్న లేకున్నా గోదావరి జలాలు వస్తాయి.
కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారు.
సీఎం గారికి ఖమ్మం పై ప్రత్యేక ప్రేమ. నాడు ఉద్యమ సమయంలో ప్రజలు గుండెకు హత్తుకున్నారు. అందుకే ఖమ్మం కరువు తొలగించాలని సీఎం కోరిక.
