Khammam/29.09.2023

Teja vartha ganapathika Telangana Khammam City

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చింతగుర్తి గ్రామం నుండి సూర్య తండా వెళ్లే రహదారిపై రూ.2.95 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న పల్లె దవాఖాన ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క చింత గుర్తి గ్రామంకే రూ.3.50 కోట్ల రూపాయలు మంజూరు చేసి పలు అభివృద్ది పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

ప్రతి గ్రామం లో వెలుగులు ఉండాలనే ఆకాంక్ష తో మండలం మొత్తం 40 హై మాస్ట్ లైట్స్ ను ఎర్పాటు చేశామన్నారు.

గ్రామంలో రూ.25 లక్షలతో హెల్త్ సెంటర్ ను మంజూరు చేయడం జరిగిందని, నేడు ప్రారంభించినంక ఇక వైద్య కోసం ఎవ్వరు ఖమ్మం వరకు వెళ్లాల్సిన పని లేదన్నారు.

ఖమ్మం కు మళ్ళీ పాత ఇనుప సరుకు వస్తుందని, దాని ఎలా ఇంటికి పంపాలో మనకు తెలుసునని దాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
.పొలాలకు డొంక రోడ్లు వేసా, మండలం కు అనుసంధానం చేస్తూ బ్లాక్ టాప్ (BT) రోడ్లు వేశా, గ్రామంలో అనేక వేడుకల్లో సీసీ రోడ్లు వేశా.. ఇంటింటికీ త్రాగునీరు అందించానని అన్నారు.

ప్రతి గ్రామంలో ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క పని చేసి చూపించినం. ఇంకా చాలా చేస్తామన్నారు.

త్వరలో ఎన్నికలు రానున్నాయని ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన లొంగకుండా BRS ప్రభుత్వంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మండలంలోని గ్రామాలలోని వివిధ పార్టీల నాయకులు ఒక్క సారి అభివృద్ది చూడండి.. అభివృద్ది ఎవరు చేశారో చుసి మీ జెండాలు కొన్ని రోజులు పక్కన పెట్టండి.. రాజకీయాలకు అతీతంగా మీ కోసం పని చేసిన నన్ను గెలిపించండి అని కోరారు.

ఇప్పుడు మన గ్రామంలో జరిగిన అభివృద్ది కేవలం శాంపిల్ మాత్రమే.. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇంతకు నాలుగింతల అభివృద్ధిని మీకు చేసి చూపిస్తా అని చెప్పారు.

ఇది మన ప్రభుత్వం.. వచ్చేది కూడా మన ప్రభుత్వమే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. కావాల్సింది మెజారిటీ అని స్పష్టం చేశారు.

సర్పంచ్ మెంటేం రామారావు అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపిపి గౌరీ, వైస్ ఎంపిపి గుత్తా రవి, మద్దినేని వెంకట రమణ, సర్పంచ్ లు మాదంశె ట్టిహరి ప్రసాద్, ప్రదీప్, వీరు నాయక్, మందడపు సుధాకర్, కుర్రా భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు