ఎంపీ వద్దిరాజు గార్ల బీఆర్ఎస్ సభలో

Date 29/09/2023

డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు:ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ ప్రజల పార్టీ, తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించనున్నరు:ఎంపీ రవిచంద్ర

కేసీఆర్,కవితల కృషి వల్లే మహిళా బిల్లుకు ఆమోదం లభించింది:ఎంపీ రవిచంద్ర

ఆర్టీసీ కార్మికులు,వీఆర్ఏలు, వీఆర్వోలకు కేసీఆర్ న్యాయం చేశారు: ఎంపీ రవిచంద్ర

ఇల్లందుకు వంద పడకల ఆస్పత్రి,రాంపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు రానున్నయ్: ఎంపీ రవిచంద్ర

ఇల్లందు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న హరిప్రియను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం:ఎంపీ రవిచంద్ర

ఇల్లందు నియోజకవర్గం గార్లలో బీఆర్ఎస్ సభలో గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ రవిచంద్ర

వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ చేరిక
ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వచ్చే దొంగలు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రజలకు హితవు పలికారు.ప్రజల కష్టనష్టాల గురించి ఎన్నడూ కూడా ఆలోచించని,పట్టించుకోని నాయకులు తమ రంగులు మార్చి వస్తున్నారని, అటువంటి వారి మాటలు విని మోసపోవద్దన్నారు.ఇతర పార్టీల మాదిరిగా బీఆర్ఎస్ మాటలు చెప్పమని,హామీలు ఇవ్వమని, మేనిఫెస్టోలో పెట్టినవి,పెట్టని వాటిని కూడా అమలు చేసి చేతల్లో చూపుతమన్నారు.బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని,తమ పార్టీ నాయకులు ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటరని, తిరిగి అధికారంలోకి వచ్చేది కూడా తామేనన్నారు.మహానేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని, తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తారని ఎంపీ రవిచంద్ర వివరించారు.బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జి అయిన ఎంపీ వద్దిరాజు గార్ల మండల కేంద్రం శుక్రవారం జరిగిన సభలో గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవితల కృషి వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందని, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ఇందుకు కోసం అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని గుర్తు చేశారు.అలాగే, జంతర్ మంతర్ వద్ద కవిత ఆందోళన చేసి 18పార్టీల మద్దతు కూడగట్టారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలను కేసీఆర్ పరిష్కరించి వారికి న్యాయం చేశారని, ఆత్మగౌరవాన్ని మరింత పెంచారని చెప్పారు.ఇల్లందుకు త్వరలో వంద పడకల ఆస్పత్రి రానున్నదని, రాంపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ఆయన వెల్లడించారు.నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేసిన, చేస్తున్న హరిప్రియను మనమందరం కలిసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర సమక్షంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు, గులాబీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే హరిప్రియలను బీఆర్ఎస్ శ్రేణులు భారీ గజమాల వేసి,శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు,ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, ఆకుతోట ఆదినారాయణ,వేం రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు