Sathupalli/30.09.2023

తేజ వార్త తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి నియోజకవర్గ

ఖమ్మం నగరంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర గారు, బండి పార్థసారథి రెడ్డి గారు, ఎమ్మెల్సీ తాతా మధు గార్లు హెలికాప్టర్ ద్వారా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు స్మారక కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సత్తుపల్లికి విచ్చేసిన వారికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి నాయకత్వంలో వేలాది మంది తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రచారరథంపై గులాబీ శ్రేణులకు అభివాదం చేస్తూ పురవీధుల గుండా సభాస్థలికి చేరుకున్నారు.

సత్తుపల్లిలో రూ.90కోట్లతో చాకలి ఐలమ్మ దోభీఘాట్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆడిటోరియం, షాధీఖానా, క్రిస్టియన్ భవన్, బస్టాండ్-ఎన్టీఆర్ నగర్ రోడ్డు విస్తరణ తదితర పనులకు వారు కలిసి శంకుస్థాపనలు చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని వారు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు