ఎంపీ వద్దిరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం.

▪️కాపులు గతంలో మాదిరిగానే “కాపు కాసి”విజయానికి తోడ్పడాలి: మంత్రి పువ్వాడ.

▪️ఎంపీ రవిచంద్ర గత ఎన్నికల్లో ఈ పార్టీలో ఉన్నట్టయితే మరింత మెజారిటీ సాధించేవాడిని: మంత్రి పువ్వాడ.

▪️రవిచంద్ర తిరిగి ఎంపీ అవుతారు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీనిచ్చారు.

▪️మేమిద్దరం సొంత అన్నదమ్ముల మాదిరిగా ముందుకు సాగుతూ ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తం: మంత్రి పువ్వాడ.

▪️ఖమ్మంలో రంగా విగ్రహం ఏర్పాటుకు, వృద్ధాశ్రమం నెలకొల్పేందుకు, హాస్టల్ అభివృద్ధికి సహకరిస్తా.

▪️మంత్రి అజయ్ కుమార్ నిత్య కృషీవలుడు, ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటరు: ఎంపీ రవిచంద్ర.

▪️మంత్రి అజయ్ కుమార్ ఖమ్మంను 3వేల కోట్లతో గొప్పగా అభివృద్ధి చేశారు: ఎంపీ రవిచంద్ర.

▪️కులం ద్వారా గుర్తింపు వస్తది, అందరిని కలుపుకుపోవడం ద్వారా విజయాలు సాధిస్తం: ఎంపీ రవిచంద్ర.

▪️రాజకీయ చైతన్యం కలిగిన తామంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తం: ఎంపీ రవిచంద్ర.

▪️మున్నూరుకాపు కార్పోరేషన్ సాధించే బాధ్యత తనదే: ఎంపీ రవిచంద్ర.

▪️ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ మున్నూరు కాపుల ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

▪️ఎంపీ రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

▪️ఈ సందర్భంగా టపాకాయలు కాల్చుతూ, పూలు జల్లుతూ మంత్రికి, ఎంపీకి యువత అపూర్వ స్వాగతం.

▪️సమావేశంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ స్వాగతోపన్యాసం చేయగా, జిల్లా శాఖ అధ్యక్షులు పారా నాగేశ్వరరావు ప్రారంభోపన్యాసం చేశారు.

▪️ఈ సందర్భంగా కార్పోరేటర్స్, యువకులు మంత్రి అజయ్ కుమార్, ఎంపీ రవిచంద్ర, సంఘం ప్రముఖులు నాగేశ్వరరావు, గాంధీలను గజమాలలతో సత్కరించారు.

మున్నూరుకాపులతో తన తండ్రి నాగేశ్వరరావు గారు, తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

గతంలో మాదిరిగానే ఈసారి ఎన్నికలలో కూడా తనను “కాపు కాసి” ఘన విజయానికి చేయూతనివ్వాల్సిందిగా మున్నూరుకాపులను ఆయన కోరారు.

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఎంపీ రవిచంద్ర గత ఎన్నికల్లో వేరే పొర్టీలో ఉండడం వల్ల భారీ ఓట్ల మెజారిటీ సాధించలేకపోయానని, ఇప్పుడా బాధ లేదని సునాయాసంగా గెలుస్తానని ధీమాగా చెప్పారు.

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ మున్నూరుకాపుల ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.బురహాన్ పురంలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యువత టపాకాయలు కాల్చుతూ, పూలు జల్లుతూ, నినాదాలిస్తూ మంత్రి అజయ్ కుమార్ కు ఎంపీ రవిచంద్రకు అపూర్వ స్వాగతం పలికారు.

మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రవిచంద్ర పదవీ కాలం గురించి నెలలు లెక్కపెట్టొద్దని తిరిగి 6ఏండ్లు పొడగించడం తథ్యమన్నారు.

తనది “పవర్ ఫుల్ టంగ్”అని రవిచంద్ర గారు ఇంకా ఆరున్నర సంవత్సరాలు ఎంపీగా ఉంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా హామీనిచ్చారని వివరించారు.

రవిచంద్ర విశాల హృదయులని, ఆయనలో అపరిచితుడి మాదిరిగా మరో మనిషి లేరని అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

తనను కూడా కాపు బిడ్డగా భావించి సంఘీభావం తెలిపినందులకు, సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు గాను మున్నూరుకాపులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.తాను, రవిచంద్ర సొంత అన్నదమ్ముల మాదిరిగా ముందుకు సాగుతూ ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి ముందుకు సాగుతామని, పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిపించుకుంటామన్నారు.

వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటుకు, వృద్ధాశ్రమం నెలకొల్పేందుకు, హాస్టల్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అజయ్ కుమార్ గారు హామీనిచ్చారు.

అదేవిధంగా మున్నూరుకాపు ప్రముఖులు ఆర్జేసీ కృష్ణకు పదవి వచ్చేందుకు ఎంపీ రవిచంద్రతో కలిసి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ “జై మున్నూరుకాపు” అంటూ నినాదాలిచ్చారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, నాయకుడికి కులంతో గుర్తింపు వస్తుందని, ఇతరులను కలుపుకుని పోవడం ద్వారా విజయాలు సాధించగల్గుతామన్నారు.

మంత్రి అజయ్ కుమార్ గారు నిత్య కృషీవలుడు అని, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటారని కొనియాడారు. ఇప్పటిదాక సుమారు 3వేల కోట్లతో ఖమ్మం సమగ్రాభివృద్ధికి మంత్రి అజయ్ కుమార్ కృషి చేశారని, ఇంకా చేస్తున్నారని పేర్కొన్నారు.

మనమందరం కూడా మంత్రి అజయ్ కుమార్ వెన్నంటి ఉండి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

రాజకీయ చైతన్యం కలిగిన తామంతా కూడా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి సల్పుతామని వివరించారు.

కాపులు మాట ఇస్తే తప్పరని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని,ఉంటామని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. మున్నూరుకాపు కార్పోరేషన్ సాధించే బాధ్యత తనదేనని, తప్పకుండా ఇది నేరవేరడం తథ్యమన్నారు.

మన కుల ప్రముఖులు ఆర్జేసీ కృష్ణ, పూల రవీందర్, సర్థార్ పుటం పురుషోత్తంలకు పదవులు వచ్చేందుకు మంత్రులు గంగుల కమలాకర్, అజయ్ కుమార్ తదితరులతో కలిసి కృషి చేస్తానని రవిచంద్ర తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు తోట రామారావు, మెంతుల శ్రీశైలం, శీలంశెట్టి వీరభద్రం, రాపర్తి రాజా, మేకల భిక్షమయ్య, గీతా వెంకన్న, ఉత్తమ సర్పంచ్ పురస్కార గ్రహీత హరిప్రసాద్, కావేరి ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.

కార్యక్రమంలో సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వైరా మునిసిపల్ వైస్ ఛైర్మన్ సీతారాం, కార్పోరేటర్స్ రాపర్తి శరత్, శీలంశెట్టి రమాదేవి, పాలెపు విజయ, మడూరి ప్రసాద్, తోట వీరభద్రం, మున్నూరుకాపు ప్రముఖులు వద్దిరాజు కిషన్, మేకల శ్రీనివాస రావు, మూలగుండ్ల శ్రీహరి, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా “జై మున్నూరుకాపు జైజై మున్నూరుకాపు”,”వర్థిల్లాలి వర్థిల్లాలి మున్నూరుకాపుల ఐక్యత వర్థిల్లాలి వర్థిల్లాలి”,”జయహో జయహో కేసీఆర్ జయహో జయహో”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు