Kjammam/20.10.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము

▪️మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు.

▪️విద్యుత్ కాంతులతో అమ్మవారి రధోత్సవము.

▪️ శోబా యాత్ర ను ప్రారంభించి పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు..

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుట్టల బజార్ లొని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవీ మాత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారముతో దర్శనమిచ్చారు.

మహిళా భక్తులచే నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలు ” కార్యక్రమంలో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, వసంత లక్ష్మీ గారు పాల్గొన్నారు.

అనంతరం మేళతాళములతో విద్యుత్కాంతి దీపాల మధ్య అమ్మవారు వెలుగొందారు. అశేష భక్తజన సందోహంతో , మాలధారణ వాసవి మాతలతో నగర సంకీర్తన, మహిళల కోలాట ప్రదర్శనలతో అమ్మవారి రధోత్సవ శోబాయాత్ర ను మంత్రి పువ్వాడ ప్రారంభించి పాల్గొన్నారు.

ఈ శోభాయాత్రలో మేయర్ పునుకొల్లు నీరజ, పగడాల నాగరాజు, వేములపల్లి వెంకన్న బాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , కోశాధికారి కొత్తమాసు హేమ సుందరరావు , ఉపాధ్యక్షులు గోళ్ళ భాస్కరరావు, బిజ్జల ఈశ్వర్ రావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవరశెట్టి పూర్ణచందర్రావు , మద్ది వెంకట వీరభద్రరావు , సహాయ కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసరావు , అనుమోలు రమేష్ , యర్రమళ్ళ సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed