Breaking….

కాంగ్రెస్ లోకి పోలేదు.. BRS లోనే కొనసాగుతాం..

▪️BRS అభ్యర్థి పువ్వాడ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం.

▪️మంత్రి పువ్వాడ సమక్షంలో BRS కండువా కప్పుకున్న మాజీ కార్పొరేటర్ లక్ష్మీ సుజాత రవి కాంత్.

కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మా ప్రమేయం లేకుండా బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హేయమైన చర్య అని మాజీ కార్పొరేటర్ ఉట్కురి లక్ష్మీ సుజాత రవికాంత్ ద్వజమెత్తారు.

ఖమ్మం నగరం డివిజన్ లో జరిగిన సమావేశం వద్దకు వచ్చి మంత్రి పువ్వాడ సమక్షంలో BRS కండువా కప్పుకున్నారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఈరోజు సాయంత్రం మా అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కండువాలు మెడలో వేసి ఫోటోలు తీయడం సిగ్గుచేటన్నారు.

కనీసం మా అనుమతి కూడా అడగకుండా ఇలా దౌర్జన్యంగా పార్టీలోకి బలవంతంగా ఎందుకు తీసుకోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము పార్టీలోని కొనసాగుతున్నామని స్పష్టంగా చెప్పినప్పటికీ బలవంతం చేరుకోవడం పెద్ద మనిషి హోదాలో ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఇలా చేయడం పద్దతి కాదని హితవు పలికారు.

మేము BRS పార్టీలో గౌరవంగా కొనసాగుతున్నామని, రానున్న ఎన్నికల్లో BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారి గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇక ముందు కూడా చేస్తామని స్పష్టం చేశారు.

దయచేసి తప్పుడు ధోరణిలో మా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇలాంటి బలవంతపు చేరికలు చేయొద్దు అని సూచిస్తున్నామని చెప్పారు.

పువ్వాడ అజయ్ కుమార్ గారి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేసి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు