రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ .

బోడేపుడి రాజా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు .

ఖమ్మం : బోడేపుడి రాజా జన్మదిన సందర్భంగా శ్రీనగర్ కాలనీ రోడ్ నెం 1 నందు బోడేపుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కొరకు రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ రక్తదాన శిబిరాన్ని బోడేపుడి ట్రస్ట్ చైర్మన్ బోడేపుడి రాజా కలిసి చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించారు . సుమారుగా 50 మంది దాకా పాల్గొని రక్తదానం చేశారు . నిరుపేద మహిళలకు 500 మందికి చీరలు పంపిణీ చేశారు . అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా బోడేపుడి రాజా ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , పువ్వుల దుర్గాప్రసాద్ , కార్పొరేటర్లు కమ్మర్తపు మురళి , చావనారాయణ తదితరులు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ట్రస్టు ద్వారా పేదలకు మరెన్నో సేవలు అందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో నాగల్ల లక్ష్మణ్ , ఎన్.ఎస్.యు.ఐ లీడర్ సందీప్ , బాధవత్
అనిల్ కుమార్ , సంపత్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed