Month: December 2023

25-12-23(సోమవారం )-సత్తుపల్లి పట్టణం – MR గార్డెన్స్ – సత్తుపల్లి పట్టణం లోని MR గార్డెన్స్ లో సింగరేణి ఎన్నికల ప్రచారం సందర్బంగా సత్తుపల్లి సింగరేణి కార్మికుల ను కలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కు అండగా ఉంటుంది అని, సింగరేణి కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంది అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC ని గెలిపించాలి అని సింగరేణి కార్మికులకు తెలిపారు…. INTUC గుర్తు గడియారం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలి అని కార్మికుల ను కోరారు… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం అని తెలిపారు…. సత్తుపల్లి సింగరేణి కార్మికుల కు పూర్తి స్థాయి లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు …

క్రిస్మస్ క పండుగ సందర్భంగా మంత్రి పలు చర్చిలను సందర్శించి ఏసుప్రభు యొక్క ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రభువుని వేడుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొనిఖమ్మం పట్టణ వైరా రోడ్ లోని RCM చర్చిలో ఈరోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న.రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రివర్యులు.శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారుRCM చర్చ్ ఫాదర్ G సురేష్ కుమార్,…

దర్శన హాస్పిటల్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి మన్ననలు పొందాలి.*. బిపిఎల్ కేటగిరీ కి రాయితీ విధానంలో సేవలందించాలి.. ఖమ్మం నగరంలో నూతన శ్రీ దర్శన హాస్పిటల్ ను ప్రారంభించిన.. డిప్యూటి సీఎం సతీమణి మల్లు నందిని. ఖమ్మం బ్యూరో డిసెంబరు 22 మన…

శ్రీ దర్శిని హాస్పటల్ ప్రారంభోత్సవం

నేడే గొప్ప ప్రారంభం శ్రీ దర్శిని హాస్పిటల్ ఖమ్మం బ్యూరో డిసెంబర్ 21 తెలుగు ప్రభశ్రీధర్ కాంప్లెక్స్ మయూరి సెంటర్శుక్రవారం మేయర్ పూనుకోలు నీరజ తో శ్రీ దర్శిని హాస్పిటల్ ఉదయం 9:30 కి ప్రారంభించబడుతుంది.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా…

మన జ్యోతి పేపర్ …..జాజికాయ సాగుకు మంత్రి తుమ్మల శ్రీకారం.
…..పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగు.
…..జాజికాయ సాగులో కేరళ అగ్రస్థానం
…..తెలంగాణలో తొలిసారిగా తన వ్యవసాయ క్షేత్రంలో జాజికాయ సాగుకు తుమ్మల సాగుబాట
….నాడు పామాయిల్ ….నేడు జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా మారిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.
…..

….. జాజికాయ సాగుకు కేరాఫ్ గా మారింది కేరళ.నష్టాలు లేకుండా దీర్ఘకాలిక లాభాలతో రైతన్న ఇంట సిరులు కురిపిస్తోన్న జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల. పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా నిలిచి.. కేరళ కే పరిమితమైన జాజికాయ సాగును తన వ్యవసాయ క్షేత్రంలో మొదలు పెట్టీ.. నాడు పామాయిల్ సాగుకు ప్రాణం పోసి నేడు జాజికాయ సాగుతో వాణిజ్య వ్యవసాయంలో తనదైన ముద్ర వేసీ ఆధునిక వ్యవసాయం వైపు రైతాంగానికి బాటలు వేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.

…తుమ్మల నాగేశ్వర్ రావు…వ్యవసాయ శాఖ మంత్రి.సహజంగా రాజకీయాల్లో ఉన్నవారు పదవుల్లో ఉన్నా లేకున్నా వారి సొంత వ్యాపారాలో లేదా కాంట్రాక్టులో లేదంటే కుటంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.కానీ మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యవసాయం…

వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు

ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కొత్త సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన సచివాలయంలో థర్డ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 27,28,29 లో నూతన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన…

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ వారి పత్రిక ప్రకటన
అంతర్ జిల్లా నేరస్థుని పట్టివేత:- వివరాలలోకి వెళితే షేక్ ఇర్ఫాన్ S/o యాకూబ్, వయసు: 26 సం:లు R/o గణేష్ టెంపుల్, కూలీ లైన్ కాలనీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాసితుడు.
పైన పేర్కొన్న నిందితుడు 2013 సంవత్సరం నుండి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు, గతంలో చాలాసార్లు జైలు జీవితాన్ని అనుభవించి, కొన్ని నెలల క్రితం ఇతని పై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాగా ఇటీవల జైల్ నుండి విడుదల అయినాడు. నిందితుడు తన ప్రవృత్తిని మార్చుకోకుండా అదే దొంగతనాలకు పాల్పడుతూన్నాడు. ఇతను ఖమ్మం, మహబూబాబాద్, మరియు కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతూ, ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇండ్లలో దొంగతనం చేసి తొమ్మిది వేల రూపాయలతో పాటు ఒక చంద్రహారంని దొంగతనం చేశాడు. ఈ యొక్క దొంగతనాలు ఇతని యొక్క స్నేహితుడు మతిన్ తో కలిసి చేసేవాడు. అంతేకాకుండా మరొక ఇంటిలో అక్టోబర్ నెలలో ఆరు తులాల బంగారం 15 తులాల వెండి దొంగతనం చేసి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గుర్తుతెలియని వ్యక్తికి అమ్మి వేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేనాడు. ఇదే విధముగా కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలు చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారం కమ్మలు, చైను మరియు 20 తులాల వెండి 20 వేల రూపాయల నగదును దొంగతనం చేసి మతిన్ అనే నేరస్తుడు పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం అతను కారాగారంలో ఉన్నాడు. ఈ యొక్క దొంగతనం అనంతరం వీరిద్దరి మధ్యల దొంగిలించిన సొత్తు గురించి గోడవపడి విడిపోయారు. అనంతరం ఇతను హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితునిగా ఉన్నాడు. తేదీ: 14-12-2023 రోజు ఉదయం బావుపేట క్రాస్ రోడ్ వద్ద హసన్‌పర్తి పోలీసు వారు వాహనముల తనఖి చేయుచుండగా ఇట్టి నేరస్తుడిని పట్టుకొని ఇతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా, ఇంతకు ముందు చేసిన నేరాల చరిత్ర గురించి చెప్పడం జరిగింది. అతని పట్టుకున్నప్పుడు అతని జేబులో రెండున్నర తులాల బంగారు చంద్రహారం లభించడం జరిగింది, ఇది ఇల్లందులో తాను దొంగిలించినటువంటి సొమ్ముగా పేర్కొన్నాడు. నేరస్తుడు. మొత్తం 30 కేసులలో నిందితుడిగా ఉన్నాడు ఇట్టి నిందితుడిని పట్టుకొనుటలో శ్రీయుత సెంట్రల్ జోన్ డి.సి.పి. యం.డి. భారీ, క్రైమ్ డి.సి.పి. శ్రీ. పి. మురళీధర్, మరియు కాజీపేట ఎ. సి. పి. శ్రీ. డేవిడ్ రాజ్ గారి ఆదేశాల మేరకు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి మరియు క్రైమ్ కానిస్టేబుల్ వి. క్రాంతి కుమార్, నాగరాజు, మధు, సోమన్న మరియు గీత సంఘటన స్థలానికి వెళ్లి అతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది మరియు కమిషనరేట్ లో మరికొన్ని దొంగతనాలు జరుగకుండా నిరోధించారు, కావునా శ్రీయుత వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గారు సంబంధిత పోలీసు వారిని అభినందించడం జరిగింది.

……పత్రికా ప్రకటన…..
ఈరోజు విజయవాడ సత్యనారాయణ పురం,అబ్బూరి వారి వీధి లో ఉన్న బ్రంహాశ్రి టేకి నరసింహా చార్యులు ఎడ్యుకేషన్ ట్రస్ట్ (దేవాదాయ ధర్మాదాయ శాఖ)విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారి నిర్వహణ లో ఉన్న 367 గజాల స్థలం కొంత కాలంగా ఇతరుల ఆక్రమణ ఉన్న స్థలాన్ని విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు కోర్టు లో గెలిచి ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో స్వాధీన పరిచు కున్నారు స్థలాన్ని పరిశీలించి స్వాధీన పత్రాలు విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి గారికి జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు అందచేశారు
చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థుల కు విధ్యా అభివృద్ధి కోసం మహా విద్యా దాత బ్రంహాశ్రీ టేకి నరసింహ చార్యులు గారు అశ యాలకు అనుగుణంగా త్వరలో నిర్మాణం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ లీగల్ కౌన్సిల్ సభ్యులు యల్. యల్. యన్ గారు,ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ అనురాధ గారు,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కల్లూరి శ్రీవాణి ,రాష్ట్ర నాయకులు కుప్పిలి సత్యనారాయణ,జవ్వాది సుదీర్,నగర సంఘం నాయకులు పేదప్రోలు బ్రాంహం,పాలడుగు శివ,చేబ్రోలు నాగేశ్వరావు, ధ నాలకోట శేఖర్ బాబు,సున్నపు వీరభద్ర చారి,కోసూరి రమేష్,సత్యవతి,బ్రమరాంభా గార్లు తదితరులు పాల్గొన్నారు

శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు..

డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ గారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు…

క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు…

You missed