నేడు శ్రీరావుభక్త గెంటేల నారాయుణరావు సంగ్రమ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

  • ముగ్గురు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటికి ఆహ్వానం
  • శివ చైతన్య ట్రస్ట్ చైర్మన్ కొలిపాక అన్నపూర్ణ

ఖమ్మం, ఫిబ్రవరి 28 ః ఎస్‌ఆర్ అండ్ బిజీఎన్‌ఆర్ కాలేజీ భూ విరాళాదాత శ్రీ రామభక్త గెంటేల నారాయణరావు సంగ్రహ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ గురువారం ఎస్‌ఆర్ అండ్ బిజీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు ఆయన మనుమరాలు, శివ చైతన్య ట్రస్ట్ ఛైర్మన్ కొలిపాక అన్నపూర్ణ తెలిపారు. బుధవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీ రామ భక్త గెంటెల నారాయణరావు జీవిత చరిత్ర నేటి వాసులకు తెలియాలని పుస్తకంగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నుండి విడిపోయిన ఖమ్మం జిల్లాలో డిగ్రీ కాలేజీ లేక సుదూర ప్రాంతాలకు ఉన్నత విద్య కోసం వెళ్లేవారని తెలిపారు. ఈ క్రమంలోనే డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనువుతించినా నిధులు లేక భద్రాచలం రాముడి ధర్మపత్ని సీతమ్మ వారి బంగారు నగలు వేలం వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మరుసటి రోజు పత్రికల్లో వార్త చూసిన నారాయుణరావు ఆ కాలేజీ ఏర్పాటకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పి ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఆ నిధులతో వంద ఎకరాలు కొనుగోలు చేసి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందుకే ఆ కాలేజీకి శ్రీరావుభక్త గెంటేలా నారాయుణరావు కాలేజీ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అంతటి త్యాగశీలి, మహనీయుడి జీవిత చరిత్ర రాసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. నేటి తరానికి ఆయన చరిత తెలియాలని పుస్తకంగా మలిచి గురువారం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. జిల్లాలోని విద్యాప్రముఖులు, విద్యాప్రియులు, నారాయుణరావు అభిమానులు, కుటుంబ సభ్యులందరూ హాజరై విజయువంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు