ఖమ్మం ప్రతినిధి మార్చి 6 (మన జ్యోతి)
రాజీవ్‌ స్వగృహా జలజ టౌన్‌షిప్‌ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ పేర్కొన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలో గల జలజ టౌన్‌షిప్‌ (రాజీవ్‌ స్వగృహ) గృహసముదాయాల ఆస్తులను ధరలు నిర్ణయించడానికి జిల్లా కలెక్టర్‌/ చైర్మన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మార్గదర్శకాలపై రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ లిమిటెడ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌.అండ్‌.బి, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 8 టవర్స్‌ (576), ఫ్లాట్స్‌, ఖాలీస్థలాన్ని 2013లో పనిచేపట్టబడి అసంపూర్తిగా ఉన్నటువంటి వాటి విలువను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో కూలంకషంగా చర్చించి తదుపరి చర్య నిమిత్తం సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిటి ఆమోదం తెలిపడం జరిగిందన్నారు.
నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ ఎస్‌.ఈ సి.భాస్కర్‌రెడ్డి, ఆర్‌.అండ్‌.బి ఎస్‌ఈ శ్యాంప్రసాద్‌, జాయింట్‌ సబ్‌ రిజిష్ట్రార్‌ పద్మ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి జి.గణేష్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ మదన్‌గోపాల్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేంలో పాల్గొన్నారు.
`

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు