ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (తెలుగు ప్రభ) పార్లమెంట్ ఎన్నికలోపు మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి .

గత బిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు ను విస్మరించింది .

విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దేవయ్య పటేల్ .

అసెంబ్లీ ఎన్నికల ముందు
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుపై హామీ ఇవ్వడంతో,
మున్నారుకాపు సామాజిక వర్గం మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
వచ్చే పార్లమెంట్ ఎన్నికలోపు,ఈనెల 12న జరిగే రాష్ట్ర క్యాబినేట్ మీటింగ్ లో మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు పై స్పష్టతను ఇవ్వాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు సాధన దిశగా మున్నూరు కాపులను చైతన్య పరిచేందుకు 33 జిల్లాల పర్యటనలో భాగంగా ఆదివారం దేవయ్య ఖమ్మం చేరుకున్నారు. ఈసందర్భంగా అసంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీతో కలిసి
కొండా దేవయ్య మాట్లాడారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటును విస్మరించిందన్నారు.
ఎన్నో పర్యాయాలు ఉద్యమాలు చేసిన, పోస్టుల కార్డు ఉద్యమం చేపట్టినప్పటికి గత పాలకులు కార్పొరేషన్ ఏర్పాటు ను పేడ చెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 54 శాతం ఉన్న బీసీ లలో 24 శాతంగా ఉండి…సుమారు
60 లక్షల జనాభా కలిగిన మున్నూరుకాపు కుల బంధావులను ఆర్థికంగా,విద్య,
రాజకీయంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని దేవయ్య కోరారు.మున్నూరుకాపు సంక్షేమం కోసం కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతి జిల్లాకు రెండు ఎకరాల భూమి తో పాటుగా,అభివృద్ధికి 5 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.మున్నూరు
కాపు పిల్లల విద్యాభివృద్ది కోసం ప్రతి మండలానికి వసతి గృహం ను ఏర్పాటు చేయాలని తెలిపారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలో మున్నూరుకాపు లకు సీటు కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని అన్నారు.ఎమ్మెల్సీ కేటగిరీలో నామినేటెడ్ పోస్టులు మున్నూరు కాపులకు ఇవ్వాలని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి,వచ్చే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో స్పష్టతను ఇవ్వకపోతే,
లక్షలాది మంది మున్నూరుకాపు కులస్థులతో హైద్రాబాద్ లో సింహగర్జన చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మున్నూరుకాపు డేవేలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్,మున్నూరుకాపు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ బండి సంజీవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి కనిశెట్టి విజయ్ కుమార్,జిల్లా కోశాధికారి జాబిసెట్టి శ్రీనివాసరావు,టౌన్ అధ్యక్షులు మడూరి పూర్ణ చందర్ రావు,జిల్లా యూత్ ప్రెసిడెంట్ పారా ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed