


సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి..
- కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి
- ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శన
ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అనంతం ఆస్పత్రి మెడికల్ సూపరింటెoడెంట్ ఎల్.కిరణ్ కుమార్ ను కలిసి..వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి లోపల అంతా పరిశుభ్రంగా వుంచారని అభినందించారు. ఇలాంటి శ్రద్ధ నే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నాయకులు దుంపల రవి, మంకెన వాసు తదితరులు పాల్గొన్నారు.
