ఎంపీ వద్దిరాజు ఖమ్మం క్యాంపు ఆఫీసులో మీటింగ్

ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు (మన జ్యోతి )ఏప్రిల్ 6

లోకసభ ఎన్నికలలో నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం: ఎంపీ రవిచంద్ర

కాంగ్రెస్ అసమర్థ పాలన చూసి ప్రజలిప్పుడు బాధపడుతున్నరు: ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరానికి ధీటుగా ఖమ్మం అభివృద్ధి చెందింది: ఎంపీ రవిచంద్ర

హామీల గురించి ప్రజలు నిలదీస్తుంటే పాలకులు ఎన్నికల కోడ్ సాకు చూపుతుండ్రు: ఎంపీ రవిచంద్ర

రాజ్యసభకు తనను తిరిగి పంపిన కేసీఆర్ గారి రుణం తీర్చుకుంట: ఎంపీ రవిచంద్ర

ఖమ్మంలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్పోరేటర్స్, ఇంఛార్జీల మీటింగుకు లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు అతిథులుగా హాజరై ప్రసంగించారు
లోకసభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.నామ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మొట్టమొదటి ఓటేసిన విషయాన్ని రవిచంద్ర గుర్తు చేశారు.అలాగే, పార్లమెంటులో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నారని, న్యాయమైన హక్కుల సాధనకు కృషి సల్పుతున్నారని వివరించారు.కాంగ్రెస్ 100రోజుల అసమర్థ పాలన చూసి ప్రజలిప్పుడు బాధపడుతున్నారని, కేసీఆర్ గారి పర్యటనల సందర్భంగా ఇది కళ్లకు కట్టినట్టు కనిపించిందన్నారు.ఖమ్మం బురహాన్ పురంలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు ఆఫీసులో టూ టౌన్ కు చెందిన కార్పోరేటర్స్,ఇంఛార్జీలతో ఎంపీలు వద్దిరాజు,నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు శనివారం రాత్రి సమావేశమయ్యారు.పార్టీ సీనియర్ నాయకులు శీలం శెట్టి వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేయర్ నీరజ, పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు ఉప్పల వెంకటరమణ,పొన్నం వెంకటేశ్వర్లు, రోహిణి సత్యనారాయణ,ఖమర్,షౌఖత్ అలీ, సుబ్బారావు,సుగుణారావు, కార్పోరేటర్స్ శ్రీవిద్య,రమ,బుర్రి వెంకట్ తదితర ప్రముఖులు హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ,ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,ఇప్పుడేమో ఎన్నికల కోడ్ వచ్చిందంటూ పాలకులు బుకాయిస్తున్నారని పేర్కొన్నారు.లోకసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ, మునిసిపల్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,సింగిల్ విండోలకు వరుసగా ఎన్నికలు జరుగుతాయని,ఈ ఏడాదంతా కూడా కోడ్ దఫదఫాలుగా అమలులో ఉంటుందని వివరించారు.ఈవిధంగా ప్రజలకిచ్చిన హామీలను పాలకులు వాయిదాల మీద వాయిదాలు వేసి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందిందని, దేశం మొత్తం మీద గ్రామ పంచాయితీలకు ప్రకటించిన 13 ఉత్తమ పురస్కారాలు మన రాష్ట్రానికే ఇందుకు ప్రబల నిదర్శనమన్నారు.ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ఒక్క అవార్డు కూడా రాకపోవడాన్ని గుర్తు చేశారు.మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ గార్ల సంపూర్ణ సహకారంతో ఖమ్మంను హైదరాబాద్ నగరానికి ధీటుగా అభివృద్ధి చేశారని ఎంపీ వద్దిరాజు వివరించారు.రాజ్యసభకు తనను తిరిగి పంపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతూ మహానేత రుణం తీర్చుకుంటానని ఎంపీ రవిచంద్ర చెప్పారు.బీఆర్ఎస్ లోకసభ అభ్యర్థి నామను మనమందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగుతూ భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుందామని, పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుదామని గులాబీ శ్రేణులను ఎంపీ వద్దిరాజు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed