





పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 06 మన జ్యోతిగంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం: మల్టీజోన్ ఐజీపీ ఏవీ.రంగనాధ్
గంజాయి సరఫరా , ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం మోపాలని మల్టీజోన్ ఐజీపీ ఏవి. రంగనాథ్ అన్నారు.
నేర సమీక్ష సమావేశానికి
మల్టీజోన్ – 1 ఐజీపీగా మొదటి సారిగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు విచ్చేసిన ఏవి. రంగనాధ్ గారిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వాగతం పలుకుతూ పుష్పగుఛ్చం అందజేశారు.
పోలీస్ కాన్ఫరెన్స్ హల్లో జరిగిన నేర సమీక్ష సమావేశం ఐజీపీ మాట్లాడుతూ…
జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాల నిర్మూలనకు పటిష్ఠమైన చర్యలు తీసుకొవాలని, ప్రధానంగా
సరిహద్దు రాష్ట్రాల పోలీస్ అధికారులను సమన్వయం చేసుకొని కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అక్రమ ఫైనాన్స్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని, పేద, మధ్య తరగతి ఆర్ధిక అవసరాన్ని ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు,స్కీమ్ ల పేరుతో అమాయకుల నుండి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వేధిస్తునట్లు ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేయాలన్నారు. నగరంలో బైక్ ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదని యువకుడిపై దాడి, దుర్మరణానికి కారణమైన ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లతో పాటు ఫైనాన్సర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అక్రమర్జనకు అలవాటు పడిన భూకబ్జాదారులను వదిలిపెట్టవద్దని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెరుగుతున్న టెక్నాలజీ తగ్గట్టుగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అనాలిసిస్ టీమ్ పటిష్ట పరచాలని సూచించారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మద్యం, నగదు, మాధకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యలు, సరిహద్దు మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పకడ్భందీగా తనిఖీలు, ఇరు రాష్ట్రల సరిహద్దు పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాని అన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విధిగా విజబుల్ పోలీసింగ్ అమలు చేయాలని తద్వారా నేరాలు నియంత్రణలో వుంటాయని అన్నారు. ఎట్టి పరిస్థితులలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగరాదని, పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పటిష్టమైన నిఘా పెడుతూ ఇసుక అక్రమ రవాణా పూర్తిగా కట్టడి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలకు సీజ్ చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు విరుద్ధంగా సరిహద్దు రాష్ట్రాల నుండి ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలు దొరికినవి దొరికినట్లు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహం పై
ఎన్నికల బందోబస్తు, శాంతిభద్రతలపై పోలీస్ కమిషనర్ వివరించారు.
పెండింగ్‌లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు,విచారణలో ఎస్సీ ఎస్టీ, పోక్సో & NDPS యాక్ట్ కేసులతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ కేసులు, తీవ్రమైన కేసుల పురోగతిపై సమీక్ష జరిపారు.
సమావేశంలో అడిషనల్ డీసీపి లా&ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపి గణేష్,ఏఎస్పీ అవినాష్ కుమార్, మౌనిక, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రహెమాన్, రఘు, శ్రీనివాసులు, ప్రసన్న కుమార్ , బోజరాజు, మల్లయ్య, ఫణింద్ర, నర్సయ్య, సిఐలు, ఆర్ ఐ లు ,ఎస్సైలు పాల్గొన్నారు. పి ఆర్ వో
