






పాలేరు నియోజకర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
నేలకొండపల్లి / ఖమ్మం రూరల్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకర్గంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో జరిగిన ఉప్పలమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గువ్వలగూడెం గ్రామంలో వి. అప్పారావు కుమారుని వివాహం ఇటీవల కాగా నూతన దంపతులను ఆశీర్వదించి పట్టువస్త్రాలను కానుకగా అందించారు. ఖమ్మం రూరల్ మండలంలో గుర్రాలపాడులో జరిగిన ఉప్పలమ్మ వేడుకలో, ఎదులాపురం గ్రామంలోని మోసే బెతస్థ స్వస్థత మహాసభలకు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
