ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..!

  • మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
  • వందలాదిగా కదిలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
  • మద్దతు తెలిపిన వామపక్షాలు

ఖమ్మం: కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ఆర్ ఆర్ ఆర్ )నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో గురువారం జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక తొలిసారిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి ఖమ్మం రాగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల నుంచి రఘురాం రెడ్డికి కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం లభించింది.
కాల్వొడ్డు నుంచి కలెక్టరేట్ కు ఆటో, బైకులతో ప్రదర్శన..
నగరంలోని కాల్వొడ్డు నయాబజార్ కళాశాల నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రఘు రాం రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి, కాంగ్రెస్ శాసన సభ్యులు, కొత్తగూడెం సీ పీ ఐ ఎమ్మెల్యే సాంబశివరావు , సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గ ప్రసాద్ తో కలిసి తో కలిసి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ గా వచ్చారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లలో వందలాదిగా తరలి వచ్చారు. అనంతరం కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ , జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు , కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్ , మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మువ్వా విజయ బాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు