ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ నేలకొండపల్లి రోడ్ షో
మన గుర్తు కారు గుర్తు మన ఓటు కారుకి






రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి నేలకొండపల్లి రోడ్ షోలో పాల్గొన్నారు
పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం రాత్రి జరిగిన ఈ రోడ్ షోకు స్థానిక ప్రజాప్రతినిధులు,గులాబీ శ్రేణులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు
ఈ రోడ్ షోలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
మన పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పక్కా లోకల్
ఇక్కడనే షుగర్ ఫ్యాక్టరీ కూడా నడిపిస్తున్నరు
ఖమ్మం నెహ్రూ నగర్ నివాసి, ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉంటరు
అదే కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడ నుంచి వచ్చిండో,ఎక్కడ ఉంటరో
హైదరాబాదులో ఉంటారా, బెంగళూరులోనా,గోవాలో నివసిస్తారా అనేది ఎవరికి కూడా తెలియదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన పాలేరు ఎండిపోయింది
కరెంట్ కష్టాలు మొదలైనయ్,సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయినయ్,తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి లేదు
మీ పాలేరు ఎమ్మెల్యేగా విశేష సేవలందించిన కందాళ ఉపేందర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలవకపోవడం విచారకరం
చాలా బాధపడ్డడు, కేసీఆర్ గారు ప్రత్యేక చెప్పడంతో ఆయనపై గౌరవంతో బాధను దిగమింగి కందాళ మీ ముందుకు వచ్చిండు
ఇక నుంచి ఇక్కడనే ఉంటరు
ఇప్పుడిక గెలిచిన ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండడం లేదు, క్యాంపు ఆఫీసుకు తెరవలేదు
కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు
రైతుబంధు ఇవ్వలేదు
కళ్యాణలక్ష్మీ,తులం బంగారం మాటే లేదు
పింఛన్లు పెంచలేదు,నిరుద్యోగ భృతి ఇవ్వట్లే
ఆ పార్టీ నాయకులు ప్రజల్ని భ్రమల్లో పెట్టి,మోసం చేసి ఓట్లు వేయించుకున్నరు
ఇచ్చిన హామీలను ఇక ముందు కూడా ఇవ్వరు కాక ఇవ్వరుకేసీఆర్ రోడ్ షోలు బ్రహ్మాండంగా విజయవంతమైనయ్
ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ -బీజేపీలు కుట్రపన్ని 48గంటల పాటు ప్రచారంపై నిషేధం పెట్టించాయి
కేంద్రంలోని బీజేపీ మన తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది
కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ఇది సరైన సమయం
తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు పార్లమెంటులో కొట్లాడిన,కొట్లాడే మన అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించుకుందాం
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,” వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,” జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు గెలిపిద్దాం గెలిపిద్దాం”,”బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దాం” అనే నినాదాలతో నేలకొండపల్లి దద్దరిల్లింది
