మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి

  • కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం
  • రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్
  • పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
  • కాంగ్రెస్ రాష్ట్ర నాయుకులు పిడమర్తి రవి, వక్కలగడ్డ సోవుచంద్రశేఖర్
    ఖమ్మం,  మతోన్మాద పార్టీ బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయుకులు పిడమర్తి రవి, వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రసాదించి బహుజనులకు రిజర్వేషన్లు, హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దళితులు, గిరిజనులు, వైునార్టీలకు, బహుజనులకు హక్కుల్లేకుండా చేయాలని బిజెపి చూస్తోందన్నారు. మనువాద పార్టీ బిజెపికి ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు కృష్ణ మాదిగ మద్దతు ఇవ్వడాన్ని ఖండించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలోకి ఉండి ఎస్‌సి వర్గీకరణ చేయకుండా కాలయాపన చేసిన బిజెపిని ఓడించాలన్నారు. మాదిగలకు సరైన ప్రాధాన్యత ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఖమ్మం పార్లమెంట్‌లో మూడు లక్షలకు పైగా మాదిగలు ఉన్నారన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మాదిగ జనాభా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో మాదిగలకు రాజకీయంగా న్యాయం చేస్తామని సిఎం చెప్పారన్నారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కి ఓటు వేసి గెలిపించి పార్లమెంట్‌లో ఎస్‌సి వర్గీకరణ జరిగేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, మహా ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్తపాక నర్సింహారావు, మాదిగ జెఏసి రాష్ట్ర నాయకులు మోదుగు జోగారావు, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర కన్వీనర్ గజ్జెల్లి మల్లిఖార్జున్, మాదిగ విద్యార్థి ఓయూ జెఏసి ప్రెసిడెంట్ జోగు గణేష్, కాంగ్రెస్ మధిర నాయకులు బొబ్బిళ్లపాటి బాబూరావు, తెలంగాణ మాదిగ విద్యార్థి జెఏసి రాష్ట్ర కన్వీనర్ మీసాల మహేష్, ఓయూ జెఏసి విద్యార్థి నాయకులు దేవరకొండ నరేష్, మాదిగ జెఏసి రాష్ట్ర నాయకులు మురళీ, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు