


ఖమ్మం, జూన్ 20: గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చింతకాని మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలు ఎంతమంది ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో స్టోర్స్ లో సామాగ్రి నిలువను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. పిల్లల ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రక్తహీనత, బలహీనంగా ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలింతలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పిల్లలతో పాటు నేలపై కూర్చొని, పిల్లలకు గేయాలు పడేలా, గేయాలకు అనుగుణంగా నృత్యం చేసేలా ప్రోత్సహించి, పిల్లలను చైతన్య పరిచారు. కలెక్టర్ పిల్లలతో మమేకమై కొద్దిసేపు సరదాగా గడిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉన్నవారే ఉన్నతంగా ఎదుగుతారని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా చింతకాని మండల నాయబ్ తహశీల్దార్ వీరభద్రనాయక్, ఎంపిఓ రవీంద్ర ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఆయా తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.
