వక్ఫ్ భూములను పరిరక్షించాలి
ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్
ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 5 ))


ఖమ్మంలోని వెలుగుమట్ల శివారు గొల్లగూడెం గ్రామ పరిధిలో ఈద్గా , ఖబరస్తాన్‌తో పాటు వీటిపక్కనున్న సర్వే నెంబర్ 431, 432 , 425 సర్వే నెంబర్లలోని సుమారు 350 కోట్ల విలువ చేసే వక్ఫ్ భూమిని కొంతమంది ప్రయివేట్ భూమిగా చూపిస్తూ జిల్లా అధికారుల అండతో కాజేస్తున్నారని ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్ ఆరోపించారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
వారు మాట్లాడుతూ ముస్తాఫానగర్‌లో సర్వే నెంబర్ 481 , 482 , 483 , 484 , 485 లలో సుమారు 15 ఎకరాల 24 కుంటల భూమి ఉందని , వీటికి సంబంధించిన ముతవల్లీలు , వారి వంశీకులు కలిసి అక్రమంగా అమ్ముకున్నారని తెలిపారు . అలాగే వెలుగుమట్ల రెవెన్యూ గొల్లగూడెం పరిధిలో మొత్తం 72.29 కుంటల భూమి ఉందని అన్నారు . ఈ భూములలో ముస్లింల ప్రార్థనా స్థలం , ఖబరస్తాన్ ఉన్నయని , వీటికి ఎలాంటి నష్టం జరిగినా ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు . వెలుగుమట్ల రెవెన్యూలోని 431 సర్వే నెంబర్ సుమారు 12 ఎకరాల 34 కుంటల భూమి ఉందని , దీనిలో 4 ఎకరాల 11కుంటల భూమిని వక్ఫ్ భూమి కాదని వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ ఆడిటర్ ఎన్‌ఓసి ఆర్డర్ రాసి ఇచ్చారని చెప్పి అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు . వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ కనసైగలతో సర్వే నెంబర్ 425లో ఓ బిల్డర్ భవనాన్ని నిర్మించారని తెలిపారు . ఈ విషయమై కలెక్టర్‌కు , మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఆధారాలు సమర్పించామని అన్నారు . వెంటనే ఈ భూమిని ఆక్రమణ
దారుల నుండి కాపాడాలని కోరారు . ఈ సమావేశంలో నసీమా ఆర్సి , తరుణం ఫాతిమా , రఫియా , జరీనా , అనీఫా , ఆఫ్రిన్ , మెహ్రజ్ , ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు .
