ఖతీజాబేగంపై చర్యలు తీసుకోవాలి
సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి
ది గాడ్ థెరిస్సా మహిళా మండలి సభ్యురాలు నాగరాణి, ఉమ
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 5 )) వెంపటి నాయుడు



ఎగ్జిక్యూటీవ్ కమిటీకి సంబంధం లేని వ్యక్తిని సంస్థ ట్రెజరర్‌గా నియమించి ఖాతాను ఓపెన్ చేసి ఐదేళ్లుగా మోసం చేస్తున్న ది గాడ్ థెరిస్సా మహిళా మండలి అధ్యక్షురాలు ప్రెసిడెంట్ ఖతీజాబేగంపై చర్యలు తీసుకోవాలని మహిళా మండలి సభ్యురాలు నాగరాణి , ఉమ డిమాండ్ చేశారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంస్థలో జరుగుతున్న మోసాలపై తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి , జిల్లాలోని డిఏపిసియుకు , కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు . దీనిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని , ఈ కేసును ఇల్లందు సిఐకి బదిలీ చేశారని తెలిపారు . కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఇప్పుడు సంస్థకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ కార్యవర్గ సభ్యులకు తెలియకుండా ప్రెసిడెంట్ ఏకపక్ష నిర్ణయంతో ఎన్నికల నోటీసులను జారీ చేశారని పేర్కొన్నారు . సంస్థలో జరుగుతున్న అన్యాయాలు , ఆర్థిక లావాదేవీలకు మణుగూరు ప్రాజెక్టు మేనేజర్ సాగర్ రెడ్డి , ఖమ్మం డిపిఎం సత్యకుమార్ అండదండలున్నట్లు ఆరోపించారు . ఫోర్జరీ సంతకం చేశానని తప్పును అంగీకరించి లెటర్ రాసి ఇచ్చి ఖతీజాబేగం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలని తెలిపారు . వెంటనే ఆమెపైనా , ఆమెకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ మీడియా సమావేశంలో సంస్థ సభ్యులు పద్మ , రాణి , రమ , లక్షీ , సంజన తదితరులు పాల్గొన్నారు .
