*ఖమ్మం రూరల్ మన జ్యోతి బ్యూరో ఆగస్టు 26 *
కూసుమంచి పోలీస్ స్టేషన్ ఖమ్మం..

గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్: ఖమ్మం రూరల్ ఏసీపీ
గంజాయిని రవాణా చేస్తూ పట్టబడిన ఇద్దరు నిందుతులపై కూసుమంచి పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. (1)మందపల్లి గ్రామము, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లాకు చెందిన
పల్లపు రఘు 36సం:లు
(ప్రస్తుతం బుద్ధనగర్, బోడుప్పల్, హైదరాబాద్ నివాసం)
(2) వెంకటాద్రిపాలెం గ్రామం, మిర్యాలగూడెం మండలం, నల్లగొండ జిల్లా చెందిన మహమ్మద్ ఖాజా పాషా 29సం:లు, సదరు నిందుతులు
2025 ఫిబ్రవరి 24న
రాత్రి చేగొమ్మ X రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కూసుమంచి వైపు నుండి అనుమానస్పదంగా వస్తున్న కారులో తనిఖీ చేయగా 89 లక్షల విలువ గల సుమారు 179కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తునట్లు గుర్తించి అరెస్టు రిమాండ్ తరలించారు. ఈరోజు
నిందుతులపై అమలు చేసిన పీడీ యాక్ట్ పత్రాలను కూసుమంచి ఇన్స్పెక్టర్ సంజీవ్ నెలకొండపల్లి ఎస్సై సంతోష్ అందజేసి చంచల్ గూడ సెంట్రల్ జైలు కు తరలించారు.
