*ఖమ్మం రూరల్ మన జ్యోతి బ్యూరో ఆగస్టు 26 *
కూసుమంచి పోలీస్ స్టేషన్ ఖమ్మం..

గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌: ఖమ్మం రూరల్ ఏసీపీ

గంజాయిని రవాణా చేస్తూ పట్టబడిన ఇద్దరు నిందుతులపై కూసుమంచి పోలీసులు పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. (1)మందపల్లి గ్రామము, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లాకు చెందిన
పల్లపు రఘు 36సం:లు
(ప్రస్తుతం బుద్ధనగర్, బోడుప్పల్, హైదరాబాద్ నివాసం)
(2) వెంకటాద్రిపాలెం గ్రామం, మిర్యాలగూడెం మండలం, నల్లగొండ జిల్లా చెందిన మహమ్మద్ ఖాజా పాషా 29సం:లు, సదరు నిందుతులు
2025 ఫిబ్రవరి 24న
రాత్రి చేగొమ్మ X రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కూసుమంచి వైపు నుండి అనుమానస్పదంగా వస్తున్న కారులో తనిఖీ చేయగా 89 లక్షల విలువ గల సుమారు 179కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తునట్లు గుర్తించి అరెస్టు రిమాండ్ తరలించారు. ఈరోజు
నిందుతులపై అమలు చేసిన పీడీ యాక్ట్‌ పత్రాలను కూసుమంచి ఇన్స్పెక్టర్ సంజీవ్ నెలకొండపల్లి ఎస్సై సంతోష్ అందజేసి చంచల్ గూడ సెంట్రల్ జైలు కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు