పూలేకు ఘన నివాళులర్పించిన ఎంపీలు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డి

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డి,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహాన్ని మంగళవారం ఉదయం ఎంపీలు వద్దిరాజు,బండి,నామాలు సందర్శించారు.ఆ మహనీయుని జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి,పేద,బడుగు, బలహీన వర్గాలు,మహిళల సముద్ధరణకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డిల వెంట జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు,మేయర్ నీరజ,డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు