KHAMMAM/25.04.2023

Scroll points

▪️సమన్వయంతో ముందుకు సాగుదాం..

▪️ఊరూరా అభివృద్ధి.. గడపగడపకూ సంక్షేమం.

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

▪️బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ.

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని, అందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా BRS పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅర్ గారి ఆదేశాల మేరకు ఎర్పాటు చేసిన ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.

కేసీఅర్ గారి నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో గులాబీ నేతలు కృషి చేయలని సూచించారు.

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, మూడోసారి గెలిపించి మళ్ళీ సీఎం కేసీఆర్‌ గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రజక సంఘం రాష్ట్ర నాయకులు రెగళ్ళ కొండల అధ్వర్యంలో పలువురు మంత్రి పువ్వాడ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

రఘునాధపాలెం మండలం వెపకుంట్ల గ్రామం నుండి Cpi ML పార్టీ నుండి శీలం మల్లయ్య అధ్వర్యంలో పలువురు BRS పార్టీలో చేరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు.

బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎక్కడికక్కడ వివరించాలన్నారు.

సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు చెప్పాలని హితబోధ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు