విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

సిఎం కేసిఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం..

కుల, చేతి వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో వారికి రూ.లక్ష ఇవ్వాలని తలచి నేటి నుండి అమలు జరిపిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి చిత్రపటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలసి కుమ్మర సంఘం అధ్వర్యంలో క్షీరభిషేకం చేశారు.

రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని దరిపల్లి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఉత్సవాల్లో కేసీఅర్ గారికి క్షీరాభిషేకం నిర్వహించారు.

అనాదిగా తమ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా ఉన్న వివిధ కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా నేడు రూ.లక్ష మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

కుల వృత్తులనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాలు సిఎం కేసీఅర్ గారికి, తెలంగాణ ప్రభుత్వంకు ఆజన్మంతం రుణ పడి ఉంటామని అన్నారు.

కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్, ఖమ్మం కార్పొరేషన్ సంఘం అధ్యక్షులు తొర్లికోండ నర్సింహారావు, ఎంబీసీ రాష్ట్ర కో-కన్వీనర్ షేక్ షకీన, వృత్తి దారుల సంఘం కన్వీనర్ ఇజ్జగిరి బాబు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు