VNB news staff reporter vempatti Naidu

యాదాద్రి సహా 5 నిర్మాణాలకు ‘ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌’ అంతర్జాతీయ అవార్డులు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం.

తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఈ మేరకు లండన్‌కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ఈ అవార్డులను ప్రకటించింది.

లండన్‌లో ఈ నెల 16న గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అవార్డులను అందించనుందని, తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆయా అవార్డులను అందుకోనున్నారు.

యాదాద్రి ఆలయం సహా 5 భవనాలకు ‘ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌’ అవార్డులు దక్కిండం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.

అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్‌ రూం, మొజాంజాహీ మార్కెట్‌ ఉన్నాయని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కడం విశేషం అని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నాయకత్వంలో ఇలాంటి మరెన్నో అవార్డులతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు