ఖమ్మం, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం “ఆధ్యాత్మిక దినోత్సవం” పురస్కరించుకుని స్థానిక వాసవి గార్డెన్ నందు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలు జరిగాయి. ఇట్టి వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి, జిల్లా కలెక్టర్ దంపతులు వి.పి. గౌతమ్, గౌతమీ లు హాజరై స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కళ్యాణ వేడుకల్లో డి.సి.సి.బి. చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, దేవాదాయ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, కార్పొరేటర్లు పగడాల నాగరాజు శ్రీవిద్య, కమర్తపు మురళి, రామ్మోహన్, వేద పండితులు రఘు నారాయణచార్యులు, వాసుదేవ చార్యుల బృందం, దాములూరి వీరభద్రం, క్రిష్ణ శర్మ, రామ శర్మ, రమేష్ శర్మ, భార్గవ చార్యులు, ప్రసాద్ శర్మ, కార్పొరేటర్లు సరిపూడి రమాదేవి, చిరుమామిళ లక్ష్మి,

మందడపు లక్ష్మి, సరస్వతి, కమల, మాటేటి అరుణ, తోట ఉమారాణి, కన్నం వైష్ణవి, రుద్రగాని శ్రీదేవి, వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed