VNB TV NEWS kmm vempatti Naidu staff reporter వి ఎన్ బి న్యూస్

మయూరి సెంటర్ వెంకటేశ్వర హాస్పిటల్ ఎదురుగా ఆందోళన
ఒక డాక్టర్ నిర్వాకంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది
వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడవలసిన వైద్యుడు తన నిర్లక్ష్య వైద్యానికి ఒక కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలని అనంత వాయువుల్లో కలిసిపోయాయి
ఈ ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. మృతదేహంతో బంధువులు శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఎదుట బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన రేపాల వీరయ్య 45 సంవత్సరాలు అనే పేషంటు అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం మయూరి సెంటర్లో శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రికి వచ్చి డాక్టర్ని సంప్రదించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నాడు గుండె సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని బాధితునికి స్టంట్ అవసరమని వైద్యుడు సూచించాడని అందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవాలని డాక్టర్ చెప్పాడని మృతుని బంధువులు తెలిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా స్టంట్ వేస్తారని స్టంట్ వేసిన మూడు రోజులకి తీవ్ర గుండె నొప్పితో రావడంతో అదే ఆసుపత్రికి వస్తే డాక్టరు స్టంట్ ఫెయిల్ అయిందని ఆరు లక్షలు అవసరమవుతుందని డాక్టర్లు తెలిపాడని మృత్యుని బంధువులు ఆరోపించారు. తీవ్ర గుండె నొప్పితో బాధపడుతుంటే స్టంటు ఫెయిల్ అయిందని విషయాన్ని నేరుగా పేషెంట్ కు చెప్పడంతోనే పేషంటు తీవ్ర ఆందోళన గురై మృతి చెందటానికి డాక్టరే కారణమని మృతుని బంధువులు ఆరోపించారు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట వృత్తిని బంధువులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు