ఖమ్మం, జూలై 25: మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక కాల్వఒడ్డు వద్ద మున్నేరు ఉధృతిని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నేరు గంట క్రితం 18 ఫీట్లు ఉండగా, ప్రస్తుతం 19 ఫీట్లకు చేరుకుందని, గంటకు ఫీటు చొప్పున ఉధృతి పెరిగే అవకాశం ఉందని అన్నారు. 1.38 లక్షల క్యూసెక్కులుతో ప్రవాహం ఉన్నట్లు, ఆకెరు, బయ్యారం ల వద్ద వాగులు ఉప్పొంగితే దాని ప్రభావం మున్నేరుపై పడుతుందని అన్నారు. నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి, మౌళిక వసతుల కల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ముంపుకు గురయ్యే మోతినగర్, బొక్కలగడ్డ ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన అన్నారు. ఇప్పటికి 6 ఇండ్ల వారిని తరలించినట్లు, ప్రవాహం పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. మునిసిపల్, రెవిన్యూ, పోలీస్, ఇర్రిగేషన్, మత్స్య, విద్యుత్ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసి విధులు కేటాయించినట్లు, రాత్రంతా అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని గమనిస్తూ ఉండాలని, లైఫ్ జాకెట్, టార్చ్ లైట్, తరలింపుకు వాహనాలు సిద్ధంగా ఉంచాలని, ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. మున్నేరు వంతెనపై రాకపోకలు నిషేధించి, ట్రాఫిక్ ను మళ్లించాలని కలెక్టర్ తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని, ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ పరిశీలన సమయంలో మునిసిపల్ ఇఇ కృష్ణా లాల్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఫిషరీస్ ఏడి ఆంజనేయ స్వామి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు